close

తాజా వార్తలు

ఉన్నావ్‌ బాధితురాలి రోడ్డుప్రమాదం కేసు సీబీఐకి?

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసు విచారణను సీబీఐకి బదలాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్ సోమవారం రాత్రి ప్రకటన చేశారు. అంతకు ముందు ఈ కేసుపై మాట్లాడిన ఆ రాష్ట్ర డీజీపీ బాధితురాలి కుటుంబసభ్యులు కోరితే కేసును సబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఘటన రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నప్పటికీ ఎటువంటి అనుమానాలకు తావులేకుండా లోతైన విచారణ కొనసాగుతోందన్నారు. అంతకుముందు ఈ ఘటన వెనక భారీ కుట్ర ఉందని.. కేసుని సీబీఐకి బదలాయించాలని పలువురు రాజకీయ ప్రముఖులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

అలాగే అత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌.. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల్ని హతమార్చేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కుల్‌దీప్, అతని సోదరుడు మనోజ్‌సింగ్‌ సహా పది మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరో 20 మందిపైనా హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలు మోపారు. 2017లో 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశారనే కేసులో కుల్‌దీప్‌ ప్రధాన నిందితుడు. గత ఏడాది ఏప్రిల్‌ 13న అరెస్టయిన నిందితుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు. రాయ్‌బరేలీ జైలులో ఉన్న తమ బంధువు మహేష్‌ సింగ్‌ను కలిసేందుకు అత్యాచార బాధితురాలు, ఆమె పిన్ని, మేనత్త, న్యాయవాది ఆదివారం కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు సోమవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.