close

తాజా వార్తలు

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతన్నాయి. సోపోర్‌ జిల్లా మల్మపన్‌పొరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో దుండగులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు అంతమొందించారు. అలాగే ఓ జవానుకి తీవ్ర గాయాలయ్యాయి. ముష్కరులు ఇంకా నక్కి ఉండడంతో ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలైన విషయం తెలిసిందే. ఓ వైపు అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రగురి ఉందన్న ప్రభుత్వ హెచ్చరికలు, మరోవైపు ఎదురుకాల్పుల పరిణామాలతో లోయలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.