close

తాజా వార్తలు

అమ్మా.. టాటా..ఆ మాటలే చిన్నారి చివరి పలుకులు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాఠశాల బస్సు
బాలుడు, అతని మామ దుర్మరణం

బాలాపూర్‌, న్యూస్‌టుడే: మరో ఒకటి రెండు నిమిషాల్లో పాఠశాల ఆవరణలోకి అడుగు పెట్టాల్సిన ఆ బాలుడిని బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది.  అప్పుడే టాటా చెప్పి ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన చిన్నారులు.. ప్రమాదానికి గురయ్యారన్న వార్త విన్న తల్లి కుప్పకూలిపోయింది. ప్రమాదస్థలికి పరుగెత్తుకు వచ్చి విగతజీవిగా పడి ఉన్న కుమారుడి మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రమాదంలో బాలుడికి వరుసకు మామ అయ్యే వ్యక్తి   కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బడంగ్‌పేటలో సోమవారం చోటుచేసుకుంది.  పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం చెన్నూరు గ్రామానికి చెందిన సురేందర్‌, రేణుక దంపతులకు శ్రేయాస్‌(8), లోక్షిత(6) సంతానం. వీరు బడంగ్‌పేటలోని ఆశంగారిరెడ్డి కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తున్నారు. స్థానికంగా ఉన్న దిల్‌సుఖ్‌నగర్‌ పబ్లిక్‌ స్కూల్లో శ్రేయాస్‌ 3వ, లోక్షిత 1వ తరగతి చదువుతున్నారు.నిత్యం తండ్రి లేదా మామ బాలకృష్ణ(24) ద్విచక్ర వాహనంపై పిల్లలను పాఠశాలలో దించి వస్తుంటారు. బాలకృష్ణ మేస్త్రీగా పని చేస్తున్నారు. సోమవారం ఇద్దరు పిల్లలను సిద్ధం చేసిన తల్లి రేణుక వారిని బాలకృష్ణతో పాఠశాలకు పంపించింది. చిన్నారులకు బైక్‌పై ఎక్కించుకొని స్కూలుకు వస్తుండగా.. పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్‌ పక్కనే మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లార్డ్స్‌ పాఠశాల బస్సు వీరి బైక్‌ను తగిలింది. దీంతో బైక్‌ అదుపుతప్పి కిందపడిపోగా.. బస్సు చక్రాలు బాలకృష్ణ తల పైనుంచి, శ్రేయాస్‌ శరీరం పైనుంచి వెళ్లాయి. తీవ్రగాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.  లోక్షిత స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌  బస్సుతో సహా పారిపోయాడు. స్థానికులు వెంటనే లోక్షితను ఆసుపత్రికి తరలించారు.

బాబూ కళ్లు తెరువురా ..అమ్మను వచ్చాను..
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న తల్లి రేణుక ఘటనా స్థలానికి వచ్చి భోరున విలపించింది. బాబూ.. కళ్లు తెరువురా అమ్మను వచ్చాను.. లేచి ఒక్కసారి అమ్మను చూడు అంటూ శ్రేయాస్‌ను తన ఒడిలోకి తీసుకుని కన్నీరుమున్నీరైంది. కొత్తగా తెచ్చుకున్న ఫోన్‌లో నిన్ననే చిన్నారుల ఫొటోలు తీశానని అక్కడున్న వారందరికి చూపిస్తూ రోదించడం అందరి హృదయాలను కలిచివేసింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.