Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 137799
            [news_title_telugu_html] => 

మరోసారి దుర్బుద్ధిని బయటపెట్టిన ఇమ్రాన్‌ఖాన్‌

[news_title_telugu] => మరోసారి దుర్బుద్ధిని బయటపెట్టిన ఇమ్రాన్‌ఖాన్‌ [news_title_english] => Indias Move May Lead to Pulwama-Like Incidents [news_short_description] => ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన  బిల్లుపై దాయాది దేశం పాకిస్థాన్‌ తన దుర్బుద్ధిని బయటపెడుతూనే ఉంది. [news_tags_keywords] => Pulwama,Imran Khan ,India,pakistan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/8PQJGDU0W6Y [news_videoinfo] => |https://www.youtube.com/embed/8PQJGDU0W6Y [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-06 19:33:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మరోసారి దుర్బుద్ధిని బయటపెట్టిన ఇమ్రాన్‌ఖాన్‌ - Indias Move May Lead to Pulwama-Like Incidents - EENADU
close

తాజా వార్తలు

మరోసారి దుర్బుద్ధిని బయటపెట్టిన ఇమ్రాన్‌ఖాన్‌

పాక్‌ పార్లమెంటు సాక్షిగా తన బుద్ధి చూపిన ఇమ్రాన్‌ ఖాన్

దిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై దాయాది దేశం పాకిస్థాన్‌ తన దుర్బుద్ధిని బయటపెడుతూనే ఉంది. భారత్‌పై  మరోసారి  పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఆ దేశ పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్వైద్-ఇ-అజామ్ మహ్మద్ అలీ జిన్నా అవిభక్త భారతదేశంలో మైనార్టీలు ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటారో ముందే ఊహించారన్నారు. 
‘పుల్వామా ఉగ్ర ఘటన వెనక పాకిస్థాన్ హస్తం లేదని చెప్పడానికి మేం ప్రయత్నించాం.  మెజార్టీ ప్రజల కోసమే భారత్ అని వారు ఇప్పటికీ భావిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న  పరిస్థితులను చూస్తుంటే ఆ దేశంలో పౌరులందరూ సమానం కాదని స్పష్టమవుతోంది. నేను భారత్‌కు వెళ్లినప్పుడు కొందరితో మాట్లాడాను. వారు రెండు దేశాల సిద్ధాంతం పట్ల సుముఖంగా కనిపించలేదు. పాకిస్థాన్ ఏర్పడకుండా ఉంటే బాగుండేది అన్నారు.  కశ్మీర్‌ను మార్చాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది జెనీవా ఒప్పందం, భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఇదే సిద్ధాంతాన్ని భారత ఆక్రమిత కశ్మీర్‌లో నిన్న ఆ దేశ ప్రభుత్వం అమలు చేసింది. అక్కడ జాతి ప్రక్షాళనకు పాల్పడుతోంది. ఆధిక్యంలో ఉన్న వర్గాన్ని అణచి వేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది అక్కడి ప్రజలను ప్రతీకారం వైపు అడుగులు వేయిస్తుంది. మరిన్ని పుల్వామా వంటి ఘటనలకు కారణమవుతుంది’ అని భారత్ మీద విషం కక్కారు. పరోక్షంగా కశ్మీరీ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అలాగే తాము ఈ అంశాన్ని ఐరాస భద్రతామండలి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కశ్మీర్‌కు సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్‌ పార్లమెంటులో ఇమ్రాన్‌ ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అందులో ఆర్టికల్ 370 ప్రస్తావన లేకపోవడంతో సభలో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.  

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.