Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 139932
            [news_title_telugu_html] => 

ఓ జవాన్‌.. మీకు పాదాభివందనం

[news_title_telugu] => ఓ జవాన్‌.. మీకు పాదాభివందనం [news_title_english] => woman touching Army mans feet for rescuing her [news_short_description] => సరిహద్దుల్లో తుపాకులు చేతబట్టి శత్రుమూకల నుంచి దేశాన్ని కాపాడటమే కాదు.. విపత్తులో ఉన్న ప్రజలను రక్షించేందుకు కూడా మన జవాన్లు ముందుంటారు. తాజాగా వరద ప్రభావిత రాష్ట్రాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, సైన్యం సేవల [news_tags_keywords] => Maharashtra ,Heavy Rains,Sangli,floods,Army [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1160071484511010816 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-10 17:32:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఓ జవాన్‌.. మీకు పాదాభివందనం - woman touching Army mans feet for rescuing her - EENADU
close

తాజా వార్తలు

ఓ జవాన్‌.. మీకు పాదాభివందనం

సంగ్లీ(మహారాష్ట్ర): సరిహద్దుల్లో తుపాకులు చేతబట్టి శత్రుమూకల నుంచి దేశాన్ని కాపాడటమే కాదు.. విపత్తులో ఉన్న ప్రజలను రక్షించేందుకు కూడా మన జవాన్లు ముందుంటారు. తాజాగా వరద ప్రభావిత రాష్ట్రాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, సైన్యం సేవల అనిర్వచనీయం. అలా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమను కాపాడుతున్న జవాన్ల పాదాలను తాకి కృతజ్ఞత చూపించిందో మహిళ. వరద ముప్పు నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న జవాన్లకు పాదాభివందనం చేసింది. మహారాష్ట్రలోని సంగ్లీలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

నీరజ్‌ రాజ్‌పుత్‌ అనే జర్నలిస్టు తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. ‘తమను కాపాడిన జవాన్లకు పాదాభివందనం చేశారు ఈ మహిళ’ అని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి కొందరు మహిళలను జవాన్లు బోట్‌ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో ఓ మహిళ తన పక్కనే నిలబడ్డ జవాన్‌ పాదాలను తాకి ధన్యవాదాలు తెలిపారు. కొంత సేపటి తర్వాత బోట్‌లోని మరో జవాన్‌ పాదాలకు కూడా ఆ మహిళ నమస్కారం చేశారు. చివరగా రెండు చేతులు జోడించి తమకు కాపాడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం నీరజ్ ఈ వీడియో పోస్టు చేయగా.. కొద్ది సేపటికే వైరల్‌ అయ్యింది. జవాన్ల పట్ల మహిళ చూపించిన కృతజ్ఞత ఎందరో హృదయాలను తాకింది. 
 

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.