Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142036
            [news_title_telugu_html] => 

ఆయన అడుగుజాడల్లోనే...

[news_title_telugu] => ఆయన అడుగుజాడల్లోనే... [news_title_english] => [news_short_description] => భర్త...గుండెల్లో తుపాకీ గుండ్లు దిగినా దేశం కోసం పోరాడాడు...  వెన్ను చూపక ఉగ్రమూకల్ని సంహరించే నేలకొరిగాడు... ఆయన వీరమరణం ఆమెను కుంగదీయలేదు...  దేశం కోసం ప్రాణాలడ్డుపెట్టిన భర్తను చూసి గర్వపడింది. ఆయన మృతదేహంపై పరచిన మువ్వన్నెల జెండాను చూసి మురిసింది.... [news_tags_keywords] => Knaika rane,Inspired story,Army, Sacrifice,Vasundhara special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 00:45:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆయన అడుగుజాడల్లోనే... - EENADU
close

తాజా వార్తలు

ఆయన అడుగుజాడల్లోనే...

భర్త...గుండెల్లో తుపాకీ గుండ్లు దిగినా దేశం కోసం పోరాడాడు...  వెన్ను చూపక ఉగ్రమూకల్ని సంహరించే నేలకొరిగాడు... ఆయన వీరమరణం ఆమెను కుంగదీయలేదు...  దేశం కోసం ప్రాణాలడ్డుపెట్టిన భర్తను చూసి గర్వపడింది. ఆయన మృతదేహంపై పరచిన మువ్వన్నెల జెండాను చూసి మురిసింది.  సరిహద్దుల్లోని శత్రువులను మట్టుబెట్టాలని శపథం పూనింది.  భర్తలాగే బెదరకుండా రక్షణ    రంగంలో చేరింది. కొడుకునూ దేశం కోసమే పెంచుతానంటోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆ వీరనారి గురించి తెలుసుకుందామా...

మా వారు... నాతో గడిపిన సమయం తక్కువే కానీ... ప్రతి క్షణం నాకు ఓ మధుర జ్ఞాపకమే. ఆయన పేరు... మేజర్‌ కౌస్తుభ్‌ అని చెబుతున్నప్పుడు ఆనందంగా కన్నా గర్వంగా అనిపిస్తుంది. ఉన్న కొద్దికాలంలోనే ఆయన నన్ను మార్చేశారు. నేను తీసుకున్న నిర్ణయమే... దానికి ఉదాహరణ. ఇప్పుడు నేనూ మా వారిలానే సైన్యంలోకి రాబోతున్నా. వార్‌ విడోస్‌ విభాగంలో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ పరీక్ష రాసి... అర్హత సాధించా. శిక్షణ తరువాత కమాండెంట్‌గా పనిచేయబోతున్నా. దీనికి కారణం ఒకవిధంగా మా వారు అందించిన స్ఫూర్తే. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని అంటారు. మా జంటా అందుకు మినహాయింపు కాదేమో! అసలు మా పరిచయమే అనుకోకుండా జరిగింది. మాది ముంబయి. నేను కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఎంబీఏ అర్హత పరీక్షకు హాజరయ్యా. అక్కడ మా ఇద్దరికీ పరిచయం అయ్యింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. మా ప్రేమ వయసు ఆరున్నరేళ్లు. ఆయన అప్పటికే ఆర్మీలో లెఫ్టినెంట్‌ హోదాలో ఉన్నారు. నేనో కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేసేదాన్ని. సైన్యంలోకి రావడం తన చిన్ననాటి కల అని ఓసారి చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తే. ఓ రోజు ఉన్నట్టుండి ‘మనం పెళ్లి చేసుకుందామా...’ అని అడిగారు. ఏ మాత్రం ఆలోచించకుండా సరే అనేశా. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు వరకూ బాధపడలేదు. పెద్దలను ఒప్పించి అయిదేళ్ల క్రితం ఒక్కటయ్యాం. క్రమంగా కౌస్తుభ్‌ ఒక్కో మెట్టూ ఎక్కుతూ...  మేజర్‌ స్థాయికి చేరారు. ఉద్యోగ బాధ్యతలు పెరిగిపోవడంతో ఆయన మాతో గడిపే సమయం క్రమక్రమంగా తగ్గిపోయింది. మా అనుబంధానికి గుర్తు అగస్త్య. నేను బాబు, అత్తమామలతో ముంబయిలో ఉండేదాన్ని. చాలా అరుదుగా మేం ఆయన దగ్గరకు వెళ్లేవాళ్లం. ఎంత దూరంలో ఉన్నా... ప్రతిరోజూ రాత్రి పన్నెండున్నర గంటలకు ఫోను చేసి కాసేపు మాట్లాడేవారు.
.............

కౌస్తుభ్‌ ఎప్పుడో ఓసారి వచ్చేవారు. ఉన్న కొద్దిరోజులూ చాలా సరదాగా, చకచకా గడిచిపోయేవి. తను వెళ్తున్నప్పుడూ నన్ను బాధపడొద్దని గట్టిగానే చెప్పేవారు. ‘నేను పనిచేసేది కశ్మీరు సరిహద్దుల్లో. అక్కడ విధులంటే ప్రమాదపుటంచులపై నడవడమే. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే... నువ్వు ధైర్యంగా ఉండాలి. పిల్లాడిని పెంచి పెద్ద చేయాలి. దేశరక్షణలో మరణం పెద్దది కాదు...’ అని నచ్చజెప్పేవారు. ఆయన ఉన్న స్థావరం పక్కనే బాంబు పేలుళ్లు ఎలా జరుగుతాయో చెబుతుంటే భయం వేసేది. నా భర్త ఇంటికి క్షేమంగా తిరిగిరావాలని ప్రతిరోజూ దేవుడికి దణ్నం పెట్టుకునేదాన్ని. అన్నీ మనం అనుకున్నట్లు జరగవుగా...
.............
అది ఆగస్టు 6. 2018. రాత్రి తొమ్మిది గంటలు. ఆయన్నుంచి ఫోను. ‘కొన్నిరోజులపాటు నాకు నీతో మాట్లాడే తీరిక ఉండదు. నా ఫోన్‌ కోసం ఎదురుచూడొద్దు, ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేం, ఏ కబురుకైనా సిద్ధంగా ఉండు..’ అని చెబుతుండగానే పై అధికారి నుంచి పిలుపు రావడంతో కట్‌చేశారు. ఆ మర్నాడే ఆయన చనిపోయారు. నాతో మాట్లాడిన రోజు...‘రాత్రి రెండు గంటల సమయంలో ఎల్‌ఓసీ వద్ద కౌస్తుభ్‌ మరో ముగ్గురితో కలిసి గస్తీకి వెళ్లారు. అక్కడ ఎనిమిది మంది ఉగ్రవాదులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం గుర్తించి, కాల్పులు జరిపారు. ఆ పరస్పర కాల్పుల్లోనే ఆయన చనిపోయారు...’ అని ఆర్మీ అధికారులు వివరించారు. ఓ వైపు తూటాల నొప్పి మెలిపెడుతున్నా... ఎదురుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి మరీ నేలకొరిగారని అధికారులు వివరిస్తున్నప్పుడు అంత బాధలోనూ గర్వంగా అనిపించింది.

ఆయన అంత్యక్రియలు జరిగాక ఎవరెవరో వచ్చి పరామర్శించేవారు. ‘నువ్వే అత్తమామల్ని, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి...’ అని చెప్పేవారు. దేశంకోసం ఆయన చేసిన త్యాగం గర్వకారణమే అయినా... ఓ సగటు ఆడదానిగా ఆలోచిస్తే... నాకు ఇంతకన్నా ఇంకేం మిగల్లేదుగా. అప్పుడప్పుడూ ఆయన అక్కడే ఉన్నారేమోనని అనిపించేది. ఒకప్పటిలా అర్ధరాత్రి పన్నెండుగంటలకు ఫోనుచేస్తారేమోనని చాలా రోజులు నిద్రపోయేదాన్ని కాదు. నేను ఏడుస్తూ కూర్చుంటే... బాబు పరిస్థితి ఏంటని అనిపించింది ఓసారి. కష్టమైనా మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు ప్రయత్నించా. ఏదో ఒకటి చేయాలనుకుంటున్నప్పుడు కౌస్తుభ్‌ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఓ ఆర్మీ అధికారి చనిపోయాక ఆయన భార్య వైమానిక రంగంలో చేరి శిక్షణ తీసుకుందట. ‘నాకు ఏదైనా జరిగితే నువ్వేం చేస్తావు, మన అగస్త్య నిన్ను చూసి గర్వపడాలి. నీకు నచ్చినట్లు ఉండు. మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పడమూ గుర్తుంది. ఆయన జ్ఞాపకాల్లాగే... ఆ మాటలూ నన్ను వెంటాడాయి. నేను ఆయనలో సగం కాబట్టి భర్త లక్ష్యాన్నీ పంచుకోవాలనుకున్నా. సైన్యంలోకి వెళ్లడానికి సిద్ధమయ్యా. అత్తమామల్ని ఒప్పించా. దానికి సంబంధించిన పరీక్ష రాసి... అర్హత సాధించా. త్వరలో నా శిక్షణా మొదలవబోతోంది. సైన్యంలో పనిచేస్తూనే... అగస్త్యను ఆయనలా పెంచాలనుకుంటున్నా. నా భర్త ఎక్కడున్నా నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారనే అనుకుంటున్నా. అన్నట్లు నా పేరు చెప్పలేదు కదూ... కనికా రాణే.. వైఫ్‌ ఆఫ్‌ మేజర్‌ కౌస్తుభ్‌.

- జైహింద్‌

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.