close

తాజా వార్తలు

పేలిన ఇన్నోవా టైరు: ఇద్దరి మృతి

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

జహీరాబాద్‌ అర్బన్‌: టైరు పేలి ఇన్నోవా వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓల్డ్‌ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా వాహనంలో ముంబయి నుంచి హైదరాబాద్‌కి వస్తోంది. జహీరాబాద్‌ మండలం సత్వార్‌ శివారుకి రాగానే వాహనం ముందు టైరు పేలింది. దీంతో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌ (27)తో పాటు కారులో ఉన్న అరుణ్ ‌(24) అక్కడికక్కడే మృతి చెందగా.. జయరాం, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సిరాజ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.