Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142974
            [news_title_telugu_html] => 

పెహ్లూఖాన్‌ కేసు.. పునర్విచారణకు ఆదేశం

[news_title_telugu] => పెహ్లూఖాన్‌ కేసు.. పునర్విచారణకు ఆదేశం [news_title_english] => Rajasthan Government Orders Re Investigation on Pehlu Khan case After All six Accused Aquitted [news_short_description] => రెండేళ్ల క్రితం పెహ్లూ ఖాన్‌ అనే వ్యక్తిని చావబాది అతను చనిపోయేందుకు కారణమైన కేసులో విచారణ మళ్లీ ప్రారంభం... [news_tags_keywords] => Pehlu Khan Lynching Case, Rajasthan Government, Re Investigation [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:29:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పెహ్లూఖాన్‌ కేసు.. పునర్విచారణకు ఆదేశం - Rajasthan Government Orders Re Investigation on Pehlu Khan case After All six Accused Aquitted - EENADU
close

తాజా వార్తలు

పెహ్లూఖాన్‌ కేసు.. పునర్విచారణకు ఆదేశం

అల్వార్‌ (రాజస్థాన్‌): రెండేళ్ల క్రితం పెహ్లూఖాన్‌ అనే వ్యక్తిపై జరిగిన మూకదాడి కేసులో విచారణ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు నిందితులను రాజస్థాన్‌లోని ఆల్వార్‌   కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఈ కేసు విచారణను పోలీసులు కావాలనే పక్కదారి పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం హెహ్లూ ఖాన్‌ కేసును పునర్విచారణకు ఆదేశించింది. పెహ్లూ ఖాన్‌ కేసులో పోలీసులు చేస్తున్న విచారణ కూడా సక్రమంగా ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో లోగడ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఇది వరకే స్పష్టం చేశారు.

పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడనే నెపంతో 2017 ఏప్రిల్‌ 1న పెహ్లూ ఖాన్‌ (55) అనే వ్యక్తిని ఓ మూక నిర్దాక్షిణ్యంగా చావ బాదింది. హరియాణాకు చెందిన పెహ్లూ ఖాన్‌ కొన్ని ఆవులను రాజస్థాన్‌ నుంచి హరియాణాకు తరలిస్తుండగా.. ఈ ఘటన అల్వార్‌ ప్రాంతంలో జరిగింది. అయితే, తాను అక్రమ రవాణా చేయడం లేదని, రంజాన్‌ పండుగ రానున్నందున అధిక పాల ఉత్పత్తి కోసం పశువులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నానని బాధితుడు ఆధారాలు చూపించినా వారు పట్టించుకోలేదు. కింద పడేసి ఈడ్చుకెళ్లి కర్రలతో బాదారు. తీవ్ర గాయాలతో ఓ ఆస్పత్రిలో చేరిన హెహ్లూ ఖాన్‌ ఏప్రిల్ 3న చనిపోయాడు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా, వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మైనర్లు జువైనల్‌ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.