Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143010
            [news_title_telugu_html] => 

ట్రిపుల్‌ తలాక్‌ నేరం కింద తొలి అరెస్టు!

[news_title_telugu] => ట్రిపుల్‌ తలాక్‌ నేరం కింద తొలి అరెస్టు! [news_title_english] => First Triple Talaq Arrest in Kerala after Parliament clears the bill [news_short_description] => వెంటవెంటనే మూడు సార్లు భార్యకు తలాక్‌ చెప్పిన కేరళకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ... [news_tags_keywords] => First Arrest, Triple Talaq, Kerala [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:28:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ట్రిపుల్‌ తలాక్‌ నేరం కింద తొలి అరెస్టు! - First Triple Talaq Arrest in Kerala after Parliament clears the bill - EENADU
close

తాజా వార్తలు

ట్రిపుల్‌ తలాక్‌ నేరం కింద తొలి అరెస్టు!

తిరువనంతపురం: వెంటవెంటనే మూడు సార్లు భార్యకు తలాక్‌ చెప్పిన కేరళకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముమ్మారు తలాక్‌ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాక అరెస్టయిన తొలి వ్యక్తి ఈయనే అని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
కోజికోడ్‌కు చెందిన ఈ.కె.ఇస్సామ్‌ అనే వ్యక్తి తన భార్యకు ముమ్మారు తలాక్‌ చెప్పి వదిలించుకోవాలని చూశాడనేది ఆరోపణ. భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని బాధితురాలు తమను ఆశ్రయించడంతో ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019 ప్రకారం నిందితుణ్ని అరెస్టు చేసినట్లు కోజికోడ్‌ పోలీసులు తెలిపారు. ఈ చట్టం కింద అరెస్టయిన తొలి వ్యక్తి ఈయనే అని తాము భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు బెయిల్‌పై ఉన్నాడు.
‘‘పెళ్లి తర్వాత ఇస్సామ్‌ తన భార్యను గల్ఫ్‌ తీసుకెళ్లాడు. కొద్ది కాలానికే ఆమెను చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. తర్వాత స్వదేశానికి తీసుకొచ్చి ఈ నెల 1న వెంట వెంటనే ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. ఇప్పుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయినా బాధితురాలికి సంబంధించిన బంగారం, డబ్బు అతడి వద్దే ఉన్నాయి’’ అని బాధితురాలి తరపు న్యాయవాది అన్వర్‌ చెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.