Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143367
            [news_title_telugu_html] => 

శవ పంచాయితీ

[news_title_telugu] => శవ పంచాయితీ [news_title_english] => The funeral panchayati [news_short_description] => బతికుండగా తిట్టుకున్నా..కొట్టుకున్నా..శతృత్వంతో వ్యవహరించినా..మరణంతో అవన్నీ పోతాయంటారు. అప్పటి వరకూ బద్ధ శతృవులుగా ఉన్నవారు సైతం మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి ఓదారుస్తారు. [news_tags_keywords] => Crime,Odisha,Funeral  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 06:53:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శవ పంచాయితీ - The funeral panchayati - EENADU
close

తాజా వార్తలు

శవ పంచాయితీ

జరిమానా కట్టి.. శవాన్ని కదల్చాలని  గ్రామస్థుల హుకుం
మూడు రోజులపాటు గుమ్మం ముందే మృతదేహం
ఒడిశాలో విషాద ఘటన

కటక్‌, న్యూస్‌టుడే: బతికుండగా తిట్టుకున్నా..కొట్టుకున్నా..శతృత్వంతో వ్యవహరించినా..మరణంతో అవన్నీ పోతాయంటారు. అప్పటి వరకూ బద్ధ శతృవులుగా ఉన్నవారు సైతం మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి ఓదారుస్తారు. కానీ, ఆధునిక ప్రపంచంలోనూ.. ఒడిశాలో చోటుచేసుకున్న ఓ ఘటన మానవత్వానికే కళంకాన్ని తెచ్చిపెట్టింది. పదేళ్ల క్రితం పెద్దలు విధించిన జరిమానా చెల్లించలేదని ఒక మహిళ మృతదేహానికి దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకున్నారు. డబ్బు కట్టలేని పరిస్థితిలో ఆ కుటుంబం ఉండటంతో..మూడు రోజులపాటు మృతదేహం ఇంటిముందే ఉండిపోయింది. చివరకు పోలీసులు కలగజేసుకుని దహన సంస్కారాలు చేయించారు. ఇంతకూ..పెద్దలు అంటున్న తప్పిదం ఏమంటే..వేర్వేరు తెగలవారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ఈ విషాద ఘటన మయూర్‌భంజ్‌ జిల్లా జొసాబాడి ఆదివాసీ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కాంద్రా సోరెన్‌ అనే ఆదివాసీ యువకుడు పదేళ్ల క్రితం పక్క గ్రామానికి చెందిన మరో తెగ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో పంచాయతీ పెద్దలు సోరేన్‌కు జరిమానా విధించారు. ఆయన ఈ మొత్తం అప్పటి నుంచీ చెల్లించలేదు. మూడు రోజుల క్రితం ఆయన భార్య పార్వతి అనారోగ్యంతో మృతిచెందింది. దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. మృతదేహానికి అంత్యక్రియలకు చేసేందుకు గ్రామస్థులు సహకరించలేదు. పంచాయితీ పెట్టారు. జరిమానా మొత్తం చెల్లిస్తేనే దహనక్రియలు చేయనిస్తామని తీర్మానించారు. కాంద్రా వద్ద డబ్బు లేక చెల్లించలేకపోయాడు. దీంతో గ్రామంలోని వారెవరూ మృతదేహాన్ని తరలించడానికి ముందుకు రాలేదు. మూడు రోజుల పాటు మృతదేహం ఇంటిముందే ఉండిపోయింది. పోలీసులు చొరవ తీసుకుని దహనక్రియలు చేయించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.