Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143372
            [news_title_telugu_html] => 

శస్త్రచికిత్సకు సాయం చేయండి సారూ..!

[news_title_telugu] => శస్త్రచికిత్సకు సాయం చేయండి సారూ..! [news_title_english] => HelpF for the surgery [news_short_description] => ఇల్లాలికి భర్త ఆసరా ఎంతో అవసరం. అదీ అనారోగ్యానికి గురైన సమయంలో.. ఏడడుగుల బంధంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త కాదన్నాడు. దీంతో చంటి బిడ్డకోసమైనా బతకాలని ఉందంటూ తల్లిదండ్రుల చెంతకు చేరింది. కానీ కన్నవారి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే.. [news_tags_keywords] => Surgery,Manchiryala,TS news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 08:40:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శస్త్రచికిత్సకు సాయం చేయండి సారూ..! - HelpF for the surgery - EENADU
close

తాజా వార్తలు

శస్త్రచికిత్సకు సాయం చేయండి సారూ..!

● చెడిపోతున్న కాలేయం

● వదిలేసి వెళ్లిపోయిన భర్త.. అనాథగా కూతురు

 
తల్లి పద్మ పక్కన దీనంగా కూర్చుని ఉన్న కూతురు అంజలిప్రసన్న

జన్నారం, న్యూస్‌టుడే: ఇల్లాలికి భర్త ఆసరా ఎంతో అవసరం. అదీ అనారోగ్యానికి గురైన సమయంలో.. ఏడడుగుల బంధంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త కాదన్నాడు. దీంతో చంటి బిడ్డకోసమైనా బతకాలని ఉందంటూ తల్లిదండ్రుల చెంతకు చేరింది. కానీ కన్నవారి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే.. నాలుగేళ్ల కూతుర్ని తలుచుకుంటూ విలపిస్తోంది. తన చంటి బిడ్డ కోసమైనా సాయం అందించాలని చేతులెత్తి మొక్కుతోంది. వైద్యం, పొందేందుకైనా కనీసం ఆసుపత్రి వరకు వెళ్లే దారి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నా ఓ ఇల్లాలి దయనీయ గాథ...!

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకి చెందిన కొండుకూరి రాజయ్య-లింగవ్వలకు అయిదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. అందులో మూడో కూతురు పద్మను రాంపూర్‌ గ్రామానికి చెందిన ఓరుగంటి నవీన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి అంజలిప్రసన్న జన్మించింది. అనంతరం పద్మ అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కడుపులో గడ్డలు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ తరువాత రెండేళ్లకు తిరిగి అదే సమస్య.. ఆరోగ్యశ్రీ కింద మరోసారి ఆపరేషన్‌ చేయడంతో కొంతకాలం బాగానే ఉంది. ఇటీవల పద్మ అనారోగ్యానికి గురికావడంతో మంచిర్యాల, వరంగల్‌ ఆసుపత్రుల్లో చూపించారు. పద్మ కడుపులో గడ్డలు కారణంగా కాలేయం చెడిపోతుందని వెంటనే ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో భర్త నవీన్‌ ఆమెను వదిలి వెళ్లిపోవడంతో పద్మ వేదనకు గురై చింతగూడలోని పుట్టింటికి చేరింది. పద్మ తల్లిదండ్రులిద్దరు కూలీపని చేసి కూతురు పద్మను, మనవరాలిని పోషిస్తున్నారు. తను చనిపోతే తన చిన్నారి బిడ్డ అనాథగా మిగిలిపోతుందని ఆమె విలపిస్తోంది. మానవతామూర్తుల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.