Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143373
            [news_title_telugu_html] => 

పెళ్లి కోసం ఒకరు..తాగుడుకు బానిసై ఇద్దరు..

[news_title_telugu] => పెళ్లి కోసం ఒకరు..తాగుడుకు బానిసై ఇద్దరు.. [news_title_english] => Three Died in different Case [news_short_description] => వేర్వేరు ఘటనల్లో రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మంచి ఉద్యోగం లేనందున ప్రేమించిన యువతిని వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబీకులు అంగీకరించలేదనే మనస్తాపంతో యువకుడు, [news_tags_keywords] => Crime,TS news,Suicide [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 08:26:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పెళ్లి కోసం ఒకరు..తాగుడుకు బానిసై ఇద్దరు.. - Three Died in different Case - EENADU
close

తాజా వార్తలు

పెళ్లి కోసం ఒకరు..తాగుడుకు బానిసై ఇద్దరు..

వేర్వేరు ఘటనల్లో రైలుకింద పడి ముగ్గురు ఆత్యహత్య 
బాధిత కుటుంబాల్లో విషాదం

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: వేర్వేరు ఘటనల్లో రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మంచి ఉద్యోగం లేనందున ప్రేమించిన యువతిని వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబీకులు అంగీకరించలేదనే మనస్తాపంతో యువకుడు, తాగుడుకు బానిసైన మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... ఘట్‌కేసర్‌ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో నివసించే కర్ణాటకకు చెందిన రఘునాథ్‌ రాథోడ్‌కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. మూడో కుమారుడు అక్షయ్‌కుమార్‌ రాథోడ్‌(25) డిప్లొమా వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం షాద్‌నగర్‌లో పాల వ్యాన్‌ నడుపుతున్నాడు. సమీపంలో ఉండే యువతిని ప్రేమించాడు. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని వారు తమ తల్లిదండ్రులకు చెప్పారు. మంచి ఉద్యోగం లభించిన తర్వాత వివాహం చేస్తామని అక్షయ్‌కుమార్‌ రాథోడ్‌ తల్లిదండ్రులు చెప్పగా.. యువతి డిగ్రీ చదువుతుండడం వల్ల ఆమె తరఫున వారు కూడా వివాహం చేసేందుకు అంగీకరించలేదు. గురువారం ఉదయం చెల్లెలుతో రాఖీని కట్టించుకునేందుకు అక్షయ్‌కుమార్‌ రాథోడ్‌ ఇంటికి వచ్చాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి మళ్లీ వెళ్లాడు. తల్లి విమల రాథోడ్‌, సోదరులు సాయంత్రం 5 గంటలకు ఫోన్‌ చేయగా వస్తానని చెప్పాడు. కానీ అతను రాలేదు. మళ్లీ ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ చేసి ఉండడంతో అతడి కోసం కుటుంబీకులు గాలించసాగారు. శుక్రవారం తెల్లవారు జామున ఘట్‌కేసర్‌- బీబీనగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై యువకుడి మృతదేహం ఉన్నట్లు రైల్వే పెట్రోలింగ్‌ సిబ్బంది గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతదేహం వద్ద ఫోన్‌ లభించడంతో దాని ఆధారంగా కుటుంబసభ్యులను గుర్తించారు. అతని కోసం వెతుకుతున్న కుటుంబసభ్యులు కూడా అక్కడికి రావడంతో వారి ద్వారా అక్షయ్‌కుమార్‌ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

కూలీ.. 
నాచారం మల్లాపూర్‌లో నివసించే నంగనూర్‌ సోమయ్య(50) ప్రైవేట్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైయ్యాడు. ఇతనికి ముగ్గురు సంతానం. గురువారం అతని భార్య తన సోదరునికి రాఖీ కట్టేందుకు వెళ్లింది. అంతకుముందు ఇంటి ఖర్చులకు డబ్బు ఇవ్వడంలేదని కోప్పడింది. దీంతో మనస్తానికి గురైన అతను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలాలి- చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మల్లాపూర్‌ బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది విషయాన్ని జీఆర్పీ పోలీసులకు చేరవేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా సోమయ్యగా గుర్తించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తాగుడుకు బానిసైన డ్రైవర్‌.. 
నాచారం మల్లాపూర్‌కు చెందిన మహమ్మద్‌ ఆసిఫ్‌(34) కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. ఇతనికి ఇద్దరు సంతానం. డ్రైవర్‌గా పనిచేస్తూ నిత్యం మద్యం తాగుతుండేవాడు. చర్లపల్లి-మౌలాలి రైల్వేస్టేషన్ల ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేకున్నట్లు గుర్తించిన రైల్వే సిబ్బంది విషయాన్ని శుక్రవారం ఉదయం జీఆర్పీ పోలీసులకు చేరవేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొంత దూరంలో ఉన్న యాక్టివా వాహనాన్ని పోలీసులు పరిశీలించారు. వాహనానికే తాళం చెవి ఉండటంతో అందులో ఉన్న సెల్‌ఫోన్‌, వాహన పత్రాలను పరిశీలించి మృతుడి కుటుంబసభ్యులను గుర్తించారు. తాగుడికి బానిసై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.