Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143908
            [news_title_telugu_html] => 

తప్పుడు అడ్రస్‌లతో జీఎస్టీ ఆదాయానికి గండి

[news_title_telugu] => తప్పుడు అడ్రస్‌లతో జీఎస్టీ ఆదాయానికి గండి [news_title_english] => GST returns with false address [news_short_description] => వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వ్యాపారి [news_tags_keywords] => GST,Amaravati,Ap news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 07:25:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తప్పుడు అడ్రస్‌లతో జీఎస్టీ ఆదాయానికి గండి - GST returns with false address - EENADU
close

తాజా వార్తలు

తప్పుడు అడ్రస్‌లతో జీఎస్టీ ఆదాయానికి గండి

సత్తెనపల్లి ఘటనతో అక్రమాలు వెలుగులోకి

ఈనాడు, అమరావతి: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వ్యాపారి చేసిన మోసం ఇందుకు నిదర్శనం. ఓ ఇంటి డోరు నంబరుతో ఇనుము వ్యాపారం చేయటానికి అతను జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు దాఖలు చేసుకోగా, ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు దాన్ని మంజూరు చేశారు. జీఎస్టీలో వ్యాపారి తన టర్నోవర్‌ను ప్రతి నెలా రిటర్న్స్‌ రూపంలో ఆన్‌లైన్‌లో ఫైల్‌ చేస్తారు. అధికారులకు వ్యాపారి ఎవరు? అతని దుకాణం ఎక్కడుందో కూడా తెలియదు. ఎంత టర్నోవర్‌ చూపితే ఆ మేరకే పన్నులు కట్టించుకుంటారు.

రూ.13 కోట్ల నష్టం: సత్తెనపల్లి వ్యాపారి భారీగా వే బిల్లులు వినియోగించారు. అంటే చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం చేసి ఉండొచ్చు. అయితే రిటర్న్స్‌ దాఖలు సమయంలో టర్నోవర్‌ వివరాలు తక్కువ చూపడంతో ప్రభుత్వానికి రూ.13 కోట్లు నష్టం వచ్చింది. ఇదంతా పన్ను ఎగవేతేనని గుంటూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ (ఎస్‌జీఎస్టీ) అధికారుల పరిశీలనలో తేలింది. ఈ వ్యత్యాసం చెల్లించాలని వ్యాపారికి నోటీసులు పంపినా స్పందన లేదు. దీంతో అధికారులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వెళ్లిన పోలీసులు వ్యాపారి ఇచ్చిన చిరునామాలో ఎలాంటి దుకాణం లేదని, ఇది బోగస్‌ సంస్థ అని తేల్చారు. ఇదే తరహాలో గుంటూరు నగరంతో పాటు నరసరావుపేట వాణిజ్యపన్నుల డివిజన్‌లో మరో పది మందికి పైగా వ్యాపారులు అక్రమాలకు తెరదీశారని గుర్తించిన అధికారులు.. చర్యలు తీసుకోవాలని కేంద్ర జీఎస్టీ అధికారులకు లేఖలు రాశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.