Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143914
            [news_title_telugu_html] => 

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

[news_title_telugu] => అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త [news_title_english] => Husband killed the Wife [news_short_description] => అనుమానం పెనుభూతమైంది. తాళికట్టిన భర్తే యముడయ్యాడు. కట్టుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడు.. ఈ కిరాతకం తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత [news_tags_keywords] => Prakasam,Crime,Wife,Murder [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 08:30:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త - Husband killed the Wife - EENADU
close

తాజా వార్తలు

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

● తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో ఘాతుకం

తాళ్లూరు, న్యూస్‌టుడే

హత్యకు గురైన నాగరత్తమ్మ

అనుమానం పెనుభూతమైంది. తాళికట్టిన భర్తే యముడయ్యాడు. కట్టుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడు.. ఈ కిరాతకం తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... తాళ్లూరు మండలం తూర్పుగంగవరానికి చెందిన నగళ్ల రాణి భర్త అంజయ్య సుమారు 20 ఏళ్ల కిందట మృతి చెందారు. ఈమెకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె నాగరత్తమ్మను దొనకొండ మండలం పెద్దన్నపాలేనికి చెందిన కండె పెదపుల్లయ్య కుమారుడు పుల్లయ్యకు ఇచ్చి పదకొండేళ్ల కిందట వివాహం చేశారు. వారి కాపురం కొంత కాలం సజావుగానే సాగింది. ఒక బాబు, పాప జన్మించారు. తర్వాత పుల్లయ్య మద్యానికి బానిసయ్యాడు. తరచూ  భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఎనిమిదేళ్ల కిందట వారిని తూర్పుగంగవరం తీసుకువచ్చారు. పుల్లయ్య అత్తగారింట్లోనే ఉంటూ... ముఠా కూలీ పనులకు వెళుతుండగా- ఆయన భార్య పాడి ద్వారా కుటుంబ పోషణలో తోడ్పాటు అందిస్తోంది. ఏడాదిగా పుల్లయ్య భార్య ప్రవర్తనను అనుమానిస్తూ తరచూ గొడవ పడుతున్నారు. అదే విషయమై ఇంట్లో వివాదాలు జరిగాయి. ఆ క్రమంలోనే ఇటీవల మద్యం తాగొచ్చి, భార్య గొంతుపై కాలేసి చంపే ప్రయత్నం చేశాడు. నాగరత్తమ్మ తల్లి రాణితోపాటు పొరుగున ఉన్నవారు రక్షించారు. దాంతో ప్రమాదం తప్పింది. తాజాగా శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో రాణి టీవీ చూస్తోంది. పుల్లయ్య మద్యం తాగి వచ్చాడు. డాబా మీద పడుకునేందుకు వెళ్లాడు. తర్వాత నాగరత్తమ్మ కూడా డాబా మీదకు వెళ్లి పడుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటిన్నర గంటల సమయంలో ఏదో అలికిడిగా ఉండటంతో రాణి నిద్రలేచి గమనించింది. ఆమె అల్లుడు పుల్లయ్య నిద్ర పోకుండా అటు, ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు నిద్ర పోకుండా అలా తిరుగుతున్నావని ప్రశ్నిస్తే- ‘నీ కూతురిని చంపేశా. డాబా మీద ఉంది. పోయి చూసుకో’ అంటూ ఆగ్రహంగా చెప్పి, అక్కడి నుంచి పరుగు తీసి పరారయ్యాడు. ఆందోళనకు గురైన రాణి వెంటనే డాబా మీదకు పరుగులు తీసింది. పైకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసి విలవిల్లాడింది. తెలిసిన వారిని పిలిపించి గమనించగా- నాగరత్తమ్మ విగత జీవిగా పడిఉంది. వెనువెంటనే ఆ సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. తన కుమార్తెను.. అల్లుడు పుల్లయ్య దేనితోనో కొట్టి హత్య చేశాడని హతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. ఎస్సై వై.నాగరాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. హతురాలి తల్లి రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నాగరత్తమ్మ పిల్లలు

ఉన్నతాధికారుల పరిశీలన

దర్శి డీఎస్పీ ప్రకాశరావు సంఘటనా స్థలికి చేరుకుని నాగరత్తమ్మ హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటనపై దర్శి సీఐ మహమ్మద్‌ మొయిన్‌తో చర్చించారు. హతురాలి కుటుంబీకులతో మాట్లాడారు. వివరాలను నమోదు చేసుకున్నారు. తర్వాత సీఐ ప్రజలతోనూ మాట్లాడారు. కేసులో నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు సహకరించాలని కోరారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నిందితుడి సమాచారం తెలిస్తే, వెంటనే తమకు తెలపాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. అధికారుల వెంట ఎస్సై నాగరాజు ఉన్నారు.

గుమిగూడిన జనం

జాగిలంతో అన్వేషణ

దర్యాప్తులో భాగంగా ఒంగోలు నుంచి పోలీసు జాగీలాన్ని రప్పించారు. తొలుత జాగీలం... వారి గృహంలోకి వెళ్లింది. తర్వాత డాబా మీదకు వెళ్లి... మహిళను హత్య చేసిన ప్రదేశానికి చేరుకుంది. అక్కడి నుంచి కిందకు దిగి... గ్రామ శివారులోని సుబాబుల్‌ తోట వద్దకు వచ్ఛి. అక్కడ నీటి తొట్టె వద్ద ఆగింది. మళ్లీ అక్కడి నుంచి గ్రామ శివారులో ఉన్న ఆలయంలోకి వచ్చి కొంత సమయం ఉండిపోయింది. తర్వాత శివరాంపురం బాట వైపునకు వెళ్లింది. వీటి ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒంగోలు నుంచి పోలీసు ఆధార సేకరణ బృందం కూడా వచ్ఛి. తగు ఆధారాలు సేకరించింది.

నిందితుడు పుల్లయ్య (పాతచిత్రం)


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.