Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143915
            [news_title_telugu_html] => 

ఒక్క అనుమానం.. దొంగను పట్టించింది

[news_title_telugu] => ఒక్క అనుమానం.. దొంగను పట్టించింది [news_title_english] => Only one suspicion .. took the thief [news_short_description] => సంతోష్‌ కుమార్‌.. బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌.. చిక్కడపల్లి పోలీస్‌ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అశోక్‌నగర్‌ నుంచి ఇందిరాపార్కు వరకు పెట్రోలింగ్‌ [news_tags_keywords] => Crime,Thief,Hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 08:19:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఒక్క అనుమానం.. దొంగను పట్టించింది - Only one suspicion .. took the thief - EENADU
close

తాజా వార్తలు

ఒక్క అనుమానం.. దొంగను పట్టించింది

ఈనాడు, హైదరాబాద్‌: సంతోష్‌ కుమార్‌.. బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌.. చిక్కడపల్లి పోలీస్‌ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అశోక్‌నగర్‌ నుంచి ఇందిరాపార్కు వరకు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఎన్టీఆర్‌ స్డేడియం ఎదురుగా మద్యం దుకాణం వద్ద ఓ మధ్యవయస్కుడు ద్విచక్రవాహనం తోసుకుంటూ వెళ్తున్నాడు. సంతోష్‌కుమార్‌ గమనించి, పెట్రోల్‌ లేనందున తోసుకుంటూ వెళ్తున్నాడేమో అనుకున్నాడు. తీక్షణంగా చూడగా తోసుకెళ్తున్న వాహనానికి తాళంచెవి లేదు. అనుమానం వచ్చి అతడిని ఆపాడు. వాహనం నీదేనా అని ప్రశ్నించాడు. తడబడుతూ సమాధానం ఇవ్వడంతో అనుమానం బలపడింది. ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్‌ నంబరును తన వద్ద ఉన్న ఐ-ప్యాడ్‌లో రవాణాశాఖ సర్వర్‌లో నమోదు చేశాడు. వాహనం యజమాని పేరు, ఫోన్‌ నంబరు తెరపై ప్రత్యక్షమయ్యాయి. వెంటనే వాహనం సొంతదారు హసీనా జబీన్‌కు ఫోన్‌ చేశాడు. తన స్కూటీని బహదూర్‌పురలో రెండురోజుల క్రితం ఎవరో దొంగిలించారని తెలిపింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ వెంకటరెడ్డికి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి నిందితుడిని ప్రశ్నించగా.. తన పేరు శ్యామ్‌ అని ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తుంటానని తెలిపాడు. ఠాణాకు తరలించి ఆరా తీమగా అతనిపై నాలుగు ఠాణాల్లో కేసులున్నాయని గుర్తించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సంతోష్‌ను కొత్వాల్‌ శనివారం అభినందించి జ్ఞాపిక అందించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.