Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143917
            [news_title_telugu_html] => 

కుళ్లిన, పురుగులు పట్టిన మాంసం విక్రయం

[news_title_telugu] => కుళ్లిన, పురుగులు పట్టిన మాంసం విక్రయం [news_title_english] => Sale of rotten worn meat [news_short_description] => నగరంలో పది రోజుల క్రితం మటన్‌ మార్కెట్‌పై దాడులు చేయగా నిల్వ ఉంచిన కేజీల కొద్ది మాంసం, తలకాయలు, కాళ్లు బయటపడగా.. శనివారం నగరపాలకసంస్థ అధికారులు కోడి మాంసం విక్రయ దుకాణాలపై దాడులు చేయగా ఫ్రిజ్‌లలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పురుగులు పట్టిన, కుళ్లిన మాంసం బయటపడింది. [news_tags_keywords] => Crime,Nellore [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 09:14:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కుళ్లిన, పురుగులు పట్టిన మాంసం విక్రయం - Sale of rotten worn meat - EENADU
close

తాజా వార్తలు

కుళ్లిన, పురుగులు పట్టిన మాంసం విక్రయం

అధికారుల దాడుల్లో తేటతెల్లం

ఫ్రీజర్‌లో నుంచి బయటకు తీసిన కుళ్లిన, పురుగులు పట్టిన మాంసం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : నగరంలో పది రోజుల క్రితం మటన్‌ మార్కెట్‌పై దాడులు చేయగా నిల్వ ఉంచిన కేజీల కొద్ది మాంసం, తలకాయలు, కాళ్లు బయటపడగా.. శనివారం నగరపాలకసంస్థ అధికారులు కోడి మాంసం విక్రయ దుకాణాలపై దాడులు చేయగా ఫ్రిజ్‌లలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పురుగులు పట్టిన, కుళ్లిన మాంసం బయటపడింది. హరనాథపురంలోని జాఫర్‌ చికెన్‌ సెంటరులో తనిఖీ చేయగా 200 కేజీల నిల్వ ఉంచిన మాంసం లభించింది. లెగ్‌పీసులు, లివర్‌, కందనకాయలు, లాలీపాప్స్‌, బోన్‌లెస్‌ చికెన్‌ ఇలా.. వేరు చేసి ఫ్రీజర్లలో పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి రూ.50 వేలు జరిమానా విధించి, మాంసం నిల్వ ఉంచేందుకు ఉపయోగించిన రెండు ఫ్రీజర్‌ బాక్సులను సీజ్‌ చేశారు. జీఎన్‌టీ రోడ్డు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వద్ద గల మదీనా రెస్టారెంట్‌లో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన వండిన మాంసాహారాన్ని గుర్తించి రూ.20 వేలు, నిప్పో సెంటరులోని లీఫ్‌ రెస్టారెంటులో తనిఖీ చేసి రూ.20 వేలు జరిమానా విధించారు. అయ్యప్పగుడి ప్రాంతంలోని వైట్‌హౌస్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో తనిఖీ చేసి ఫ్రిజ్‌లలో బూజు పట్టిన, కుళ్లిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకుని రూ.50 వేలు జరిమానా విధించినట్లు కమిషనర్‌ తెలిపారు.

పారిశుద్ధ్య లోపం.. ప్రత్యేక జంతు వధశాలలు లేకపోవడం.. ఉన్నా సరైన నిర్వహణ లేకపోవడం, పశువైద్య అధికారుల పర్యవేక్షణ కొరవడటం తదితర కారణాలతో జిల్లాలో మాంసాహారులు నాణ్యమైన మాంసాన్ని పొందలేకపోతున్నారు. నెల్లూరు నగరంలో మాంసం విక్రయాల కోసం రూ.2 కోట్లతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. ప్రజారోగ్యశాఖ అధికారి, పశువైద్యాధికారి జంతువులను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరిస్తూ ముద్ర వేయాల్సి ఉండగా.. ఈ నిబంధన అమలు కావడడం లేదు. చికెన్‌ దుకాణాలపై తనిఖీలు కొరవడటంతో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన, చనిపోయిన కోళ్ల మాంసాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు పీవీవీఎస్‌ మూర్తి, కమిషనర్‌

గొర్రెలు, మేకలను నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వధశాలలోనే వధించాలి. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిరంతరం దాడులు కొనసాగిస్తాం. కోళ్ల మాంసం విక్రయదారులు ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.