close

తాజా వార్తలు

జెండా పోల్‌ను తొలగిస్తుండగా విద్యుదాఘాతం

ఐదుగురి విద్యార్థుల మృతి


బెంగళూరు : కర్ణాటకలోని కొప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలలోని వసతిగృహంలో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా పోల్‌ను ఆదివారం తొలగిస్తుండగా.. అది విద్యుత్‌ తీగలను తాకింది. దీంతో పోల్‌ను పట్టుకున్న విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ పాఠశాలను ఓ ప్రైవేట్‌ భవనంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై  రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.