Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144423
            [news_title_telugu_html] => 

బాలిక తలపై బైక్‌ నడిపిన రాక్షసులు

[news_title_telugu] => బాలిక తలపై బైక్‌ నడిపిన రాక్షసులు [news_title_english] => Stalkers drive bike over Class 11 girls head to kill her [news_short_description] => మానవత్వం మంటగలిసింది. దుండగుల దురాగతానికి అమాయకురాలైన ఒక బాలిక బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌లో ముగ్గురు దుండగులు బాలికను వెంటాడి వేధించి ఆమె తలపై బైక్‌ [news_tags_keywords] => Crime,Uttarpradesh,Girl [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 06:55:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బాలిక తలపై బైక్‌ నడిపిన రాక్షసులు - Stalkers drive bike over Class 11 girls head to kill her - EENADU
close

తాజా వార్తలు

బాలిక తలపై బైక్‌ నడిపిన రాక్షసులు

లఖ్‌నవు: మానవత్వం మంటగలిసింది. దుండగుల దురాగతానికి అమాయకురాలైన ఒక బాలిక బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌లో ముగ్గురు దుండగులు బాలికను వెంటాడి వేధించి ఆమె తలపై బైక్‌ నడపడంతో ఆమె మరణించింది. ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది. పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వెళుతున్న బాలికను అదే  సమయంలో బైక్‌ మీద వస్తున్న ముగ్గురు వెంటాడారు. అసభ్య పదజాలంతో వేధించారు. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవటంతో పారిపోయారు. అవమానంగా భావించి పగతో రగిలిపోయారు. కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చారు. ఇద్దరు ఆమెను కదలకుండా నేలపై పడుకోబెట్టగా, మరొకడు ఆమె తలపై బైక్‌ నడిపాడు. ఇంత ఘోరం జరిగి తన మనవరాలు తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో ఉంటే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్దయగా ప్రవర్తించారని, చివరకు ఈ నెల 11న కేసు నమోదు చేశారని బాధితురాలి తాత చెప్పారు. మరోవైపు లఖ్‌నవు కేజీఎంయూ ఆస్పత్రి వైద్యులు చికిత్సకు నిరాకరించి మానవత్వం మరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మరణించింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.