Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144425
            [news_title_telugu_html] => 

కత్తితో నరికి.. ఖండఖండాలు చేసి..

[news_title_telugu] => కత్తితో నరికి.. ఖండఖండాలు చేసి.. [news_title_english] => Son killed his father [news_short_description] => కన్న కొడుకే ఆ తండ్రి పాలిట కాలయముడయ్యాడు. కిరాతకం అనే పదానికే పరాకాష్ఠగా నిలిచాడు. తల్లి, చెల్లి చూస్తుండగానే కన్నతండ్రిని కత్తులతో దారుణంగా నరికి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు...మృతదేహాన్ని ఖండఖండాలు చేశాడు. వాటిని తరలించడానికి వీలుగా బకెట్లలో నింపాడు. వారు నివసించే [news_tags_keywords] => Crime,Hyderabad,Son,Father [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => xjGuslYBOkE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 07:22:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కత్తితో నరికి.. ఖండఖండాలు చేసి.. - Son killed his father - EENADU
close

తాజా వార్తలు

కత్తితో నరికి.. ఖండఖండాలు చేసి..

తల్లి, చెల్లి ముందే తండ్రిని చంపిన తనయుడు 
మృతదేహాన్ని ముక్కలు చేసి బకెట్లలో ఉంచిన కిరాతకం

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: కన్న కొడుకే ఆ తండ్రి పాలిట కాలయముడయ్యాడు. కిరాతకం అనే పదానికే పరాకాష్ఠగా నిలిచాడు. తల్లి, చెల్లి చూస్తుండగానే కన్నతండ్రిని కత్తులతో దారుణంగా నరికి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు...మృతదేహాన్ని ఖండఖండాలు చేశాడు. వాటిని తరలించడానికి వీలుగా బకెట్లలో నింపాడు. వారు నివసించే వీధిలో జనసంచారం ఎక్కువగా ఉండటంతో ఆ బకెట్లను బయటకు తరలించలేకపోయాడు. 3 రోజులు గడిచిన తర్వాత దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం బయటపడింది. మహారాష్ట్రకు చెందిన మారుతీ కిషన్‌ సుతార్‌(80) రైల్వే గూడ్సు డ్రైవర్‌గా పదవీ విరమణ పొందారు. ఆయనకు భార్య గయ, కుమార్తెలు అనుపమ, ప్రపుల్ల, కుమారుడు కిషన్‌(30) సంతానం. మరో కుమారుడు చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడు. అనుపమకు మారేడ్‌పల్లికి చెందిన ఆటోడ్రైవర్‌ రవితో వివాహమైంది. ఆయన... భార్య, కుమార్తె ప్రపుల్ల, కొడుకు కిషన్‌లతో కలిసి ఆర్టీసీ కాలనీలోని ఎన్‌ఏ కృష్ణానగర్‌లో ఉంటున్నారు. తగిన సంపాదనలేని కిషన్‌ ఆర్థిక సమస్యలతో తండ్రితో తరచూ గొడవ పడేవాడు. దీనికితోడు తండ్రి మద్యం అలవాటు కుటుంబ సభ్యులకు నచ్చేదికాదు. వీటన్నింటనీ దృష్టిలో ఉంచుకుని తండ్రిని అంతం చేయాలని కిషన్‌ నిర్ణయించుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తల్లి, చెల్లి ముందే కత్తులతో తండ్రిని పాశవికంగా హత్యచేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలు చేసి ఇంట్లోనే వేర్వేరు బకెట్లలో ఉంచాడు. ఆదివారం స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మారుతీ ఇంటిని పరిశీలించారు. హత్య తీరును తెలుసుకొని విస్తుపోయారు. హత్యచేసిన తర్వాత రెండు రోజులపాటు ఇంట్లో ఉన్న కుమారుడు తాజాగా కనిపించడంలేదు. పోలీసుల అదపులోనే ఉన్నాడని తెలుస్తోంది.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.