Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144972
            [news_title_telugu_html] => పింఛను సొమ్ము కోసమే కిరాతకం
            [news_title_telugu] => పింఛను సొమ్ము కోసమే కిరాతకం
            [news_title_english] => father brutally murdered by son
            [news_short_description] => మౌలాలి ఆర్టీసీ కాలనీ ఎన్‌ఏ కృష్ణనగర్‌లో కన్న తండ్రి మారుతి(70)ని కుమారుడు హత్య చేసి ముక్కలుగా నరికి బకెట్లలో పెట్టిన ఘటనలో మల్కాజిగిరి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.హత్యలో కుటుంబసభ్యుల పాత్రనిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. నిందితుడు కిషన్‌ సుతారి (38) పదోతరగతితోనే చదువు ఆపేశాడు. తాగుడు అలవాటై తండ్రి సంపాదనపైనే ఆధారపడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె భర్త తీరు నచ్చక వదలివెళ్లి 

            [news_tags_keywords] => murder,crime,hyd
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 06:16:23
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పింఛను సొమ్ము కోసమే కిరాతకం - father brutally murdered by son - EENADU
close

తాజా వార్తలు

పింఛను సొమ్ము కోసమే కిరాతకం

కన్నతండ్రిని హత్య చేసిన కేసులో విచారణ వేగవంతం
 ఇతర కుటుంబసభ్యుల పాత్రపై ఆరా

మల్కాజిగిరి,న్యూస్‌టుడే: మౌలాలి ఆర్టీసీ కాలనీ ఎన్‌ఏ కృష్ణనగర్‌లో కన్న తండ్రి మారుతి(70)ని కుమారుడు హత్య చేసి ముక్కలుగా నరికి బకెట్లలో పెట్టిన ఘటనలో మల్కాజిగిరి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.హత్యలో కుటుంబసభ్యుల పాత్రనిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. నిందితుడు కిషన్‌ సుతారి (38) పదోతరగతితోనే చదువు ఆపేశాడు. తాగుడు అలవాటై తండ్రి సంపాదనపైనే ఆధారపడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె భర్త తీరు నచ్చక వదలివెళ్లి పోయింది.

ప్లాస్టిక్‌ బకెట్లు తెచ్చిందెవరు?.. తాగుడు ఖర్చులు పెరగటంతో అందుకు తగ్గట్టుగా తండ్రి నుంచి డబ్బులు రాకపోవటంతో కిషన్‌ అతడిపై ద్వేషాన్ని  పెంచుకున్నాడు. తండ్రి మారుతికి కూడా తాగుడు అలవాటు ఉంది. దీంతో ఇంట్లో యుద్ధవాతారణం నెలకొనేది. తండ్రిని చంపేస్తే వచ్చే పింఛను సొమ్ము తల్లి నుంచి తీసుకోవచ్చని పథకం వేశాడు. కళ్లముందు మారుతిని హత్య చేస్తున్నా భార్య గయ, కూతురు ప్రఫుల్ల ఎందుకు సహకరించారనేది, శరీర భాగాలను పెట్టడానికి కొత్తగా ప్లాస్టిక్‌ బకెట్లు తీసుకువచ్చిందెవ్వరనేది పోలీసులు విచారిస్తున్నారు. విశ్వసనీయ కథనం ప్రకారం 28 ఏళ్లు దాటినా కుమార్తె పెళ్లి గురించి తండ్రి ఆలోచించకపోవడంతో ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి గడపదాటకుండా మారుతి తన దైనందిన కార్యక్రమాలన్నీ ఇంట్లోనే భార్యతో చేయించుకోవటం, తాగి వచ్చి గొడవపడుతుండడంతో ఆమె ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ కారణాలతోనే ఈ దారుణంలో వారు భాగస్వామి అయ్యారా అని విచారిస్తున్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని సమాచారం. మారుతిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేశారా.లేక ఏదైనా విషం పెట్టి చనిపోయిన తర్వాత ముక్కలుగా నరికారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహ భాగాలను పరీక్షలకు పంపారు. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని శవాగారంలో భద్రపర్చారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.