Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144975
            [news_title_telugu_html] => 

 స్నేహితుడితో కలిసి కన్నతండ్రిని పొడిచి చంపిన కుమార్తె

[news_title_telugu] =>  స్నేహితుడితో కలిసి కన్నతండ్రిని పొడిచి చంపిన కుమార్తె [news_title_english] => Daughter killed her Father [news_short_description] => యుక్తవయసు.. స్నేహాలపై ఆసక్తి.. అవి వద్దన్నందుకు పట్టరాని కోపం.. ఇవన్నీ కలిపి ఓ యువతి తన కన్నతండ్రినే చేతులారా చంపుకొనేలా చేశాయి. మగపిల్లాడితో స్నేహం వద్దని వారించినందుకు అతడితోనే కలిసి తండ్రిని హతమార్చింది. ఇందుకోసం ఆమె పకడ్బందీగా కుట్రపన్నింది. [news_tags_keywords] => Father,Daughter,Crime,Murder [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 06:52:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
 స్నేహితుడితో కలిసి కన్నతండ్రిని పొడిచి చంపిన కుమార్తె - Daughter killed her Father - EENADU
close

తాజా వార్తలు

 స్నేహితుడితో కలిసి కన్నతండ్రిని పొడిచి చంపిన కుమార్తె

   బెంగళూరులో ఓ బాలిక దురాగతం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: యుక్తవయసు.. స్నేహాలపై ఆసక్తి.. అవి వద్దన్నందుకు పట్టరాని కోపం.. ఇవన్నీ కలిపి ఓ యువతి తన కన్నతండ్రినే చేతులారా చంపుకొనేలా చేశాయి. మగపిల్లాడితో స్నేహం వద్దని వారించినందుకు అతడితోనే కలిసి తండ్రిని హతమార్చింది. ఇందుకోసం ఆమె పకడ్బందీగా కుట్రపన్నింది. ఇంతా చేస్తే ఆమె చదివేది తొమ్మిదో తరగతి! ఈ దారుణ ఘటన బెంగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాజీనగర ఐదోబ్లాక్‌ ఏడోక్రాస్‌లో ఓ వ్యాపారి తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి నివసించేవారు. ఆయన కుమార్తె (15) తొమ్మిదో తరగతి చదువుతోంది. బీకాం చదువుతున్న ప్రవీణ్‌తో ఆ బాలిక స్నేహం చేస్తోంది. పదే పదే ప్రవీణ్‌ తమ ఇంటికి రావడాన్ని ఆమె తండ్రి గమనించారు. తరచూ చరవాణిలో అతడితో మాట్లాడటంతో కుమార్తెను హెచ్చరించారు. మగపిల్లాడితో స్నేహం మానుకోవాలని చెప్పడంతో.. ఆమె తన తండ్రిపై కోపం పెంచుకుంది. ఆయన అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆదివారం ఉదయం బాలిక తల్లి, తమ్ముడు పాండిచ్చేరి వెళ్లారు. వాళ్లను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు బయల్దేరేముందు ఆ బాలిక నిద్రమాత్రలు కలిపిన పాలను తండ్రికి ఇచ్చింది. తిరిగి వచ్చి.. తండ్రి నిద్రపోవడం చూసి ప్రవీణ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి బాలిక తండ్రిని కత్తులతో పొడిచారు. అనంతరం గొంతు కోసి మృతదేహాన్ని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లారు. పడకగదిలో రక్తం మరకల్ని శుభ్రం చేశారు. ప్రవీణ్‌ బయటకు వెళ్లి రెండు లీటర్ల పెట్రోలు తెచ్చాడు. మృతదేహంపై ఇద్దరూ కలిసి పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. వారిద్దరిపైనా పెట్రోలు పడి, మంటలు అంటుకోవడంతో ఇద్దరూ గాయపడ్డారు. మంటలు వ్యాపించడంతో బాలిక మిద్దె మీదకు వెళ్లి కేకలువేసింది. ఇరుగుపొరుగువారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్ని ఆర్పారు. వారితో పాటు అక్కడికి వచ్చిన పోలీసులు కూపీ లాగారు. బాలికను, ప్రవీణ్‌ను చికిత్స కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఇంటికి వెళ్లి అల్పాహారం తిని వచ్చేలోపు మంటలు లేచాయని బాలిక పోలీసులకు తెలిపింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.