Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144986
            [news_title_telugu_html] => 

బాలికలపై ఉపాధ్యాయుడి వేధింపులు

[news_title_telugu] => బాలికలపై ఉపాధ్యాయుడి వేధింపులు [news_title_english] => Teacher harass the Student [news_short_description] => విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన గుంటూరు జిల్లా చిరుమామిళ్ల ఏపీ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయునిపై పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు [news_tags_keywords] => Teacher,Harassment,Guntur [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 08:18:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బాలికలపై ఉపాధ్యాయుడి వేధింపులు - Teacher harass the Student - EENADU
close

తాజా వార్తలు

బాలికలపై ఉపాధ్యాయుడి వేధింపులు

చిరుమామిళ్ల(నాదెండ్ల): విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన గుంటూరు జిల్లా చిరుమామిళ్ల ఏపీ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయునిపై పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. కొంతకాలంగా బాలికలను వేధిస్తుండటంపై వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఏపీ ఆదర్శ పాఠశాలలో జి.క్రాంతికిరణ్‌ సామాన్య శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. పాఠశాలకు చెందిన బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఒంటరిగా ఉన్న సమయంలో వికృత చేష్టలకు పాల్పడుతుండటంతో బాలికలు విషయాన్ని ఇంట్లో కుటుంబసభ్యులకు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన ఆచార్యురాలు పద్మజను నిలదీశారు. ఆమె విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయుడి వేధింపుల విషయమై బాలిక తండ్రి ఒకరు సోమవారం రాత్రి నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడు క్రాంతికిరణ్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.