Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145587
            [news_title_telugu_html] => 

రద్దైన నోట్లు రూ.కోటిస్తే రూ.15లక్షలిస్తాం!

[news_title_telugu] => రద్దైన నోట్లు రూ.కోటిస్తే రూ.15లక్షలిస్తాం! [news_title_english] => Old Currency Seized And Arrested in vizag [news_short_description] => చలామణీలో లేని పాతనోట్లు మార్చాలని ఓ వ్యాపారిపై ఒత్తిడి తెస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.... [news_tags_keywords] => old currency,crime,vizag [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => lntONHKLjn8 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:34:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రద్దైన నోట్లు రూ.కోటిస్తే రూ.15లక్షలిస్తాం! - Old Currency Seized And Arrested in vizag - EENADU
close

తాజా వార్తలు

రద్దైన నోట్లు రూ.కోటిస్తే రూ.15లక్షలిస్తాం!

ఘరానా ముఠాను పట్టుకున్న విశాఖ పోలీసులు

విశాఖ : చలామణీలో లేని పాతనోట్లు మార్చాలని ఓ వ్యాపారిపై ఒత్తిడి తెస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. కోటి రూపాయల విలువ చేసే పాతనోట్లకు రూ.15 లక్షలు కొత్త నోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తితో కొందరు ఒప్పందం చే సుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి తప్పించుకు తిరగడంతో పాత నోట్లు కలిగి ఉన్న ముఠా ఆ వ్యక్తి స్నేహితుడైన వ్యాపారి వద్దకు వచ్చారు. పాత నోట్లను మార్చే బాధ్యత వ్యాపారిదే అని ఒత్తిడి చేశారు. వ్యాపారి తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పినా వినకుండా తుపాకీతో బెదిరించి హతమారుస్తామనడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి సహకారంతో అగనంపూడి టోల్ గేట్ వద్ద పాత నోట్లు ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు వాహనంగా నమ్మించి..
ఆ వాహనాన్ని ఎవరూ తనిఖీ చేయకుండా ఉండేందుకు నిందితులు పోలీసు బోర్డును పెట్టడంతో పాటు ఐజీ ర్యాంకు అధికారి వాహనంగా నమ్మించేందుకు వెనుక రెండు నక్షత్రాలను సైతం పెట్టడం గమనార్హం. ఈ వాహనంలో ఉన్న ఒక కోటి 97 వేల రూపాయలతో పాటు, వాకీ టాకీలు, తుపాకీ, 6 డమ్మీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 13 మందిని అరెస్టు చేయగా మరొకరిని పట్టుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఆ నోట్లు ఎక్కడివి..
రూ.కోటికి పైగా విలువ చేసే ఆ పాత నోట్లు ఎక్కడి నుంచి సేకరించారు అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. పాత నోట్లను కొత్త నోట్లుగా మారుస్తామని చెప్పిన వ్యక్తి ద్వారా అసలు విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.