Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146039
            [news_title_telugu_html] => 

చరవాణిలో నగ్నచిత్రాలు పంపించు!

[news_title_telugu] => చరవాణిలో నగ్నచిత్రాలు పంపించు! [news_title_english] => Send nude photos BBA student Harrsashment [news_short_description] => స్నేహం చేయకుంటే చంపేస్తానని బెదిరించాడు.. భయపడి స్నేహం చేసింది.. కొన్ని రోజుల తర్వాత సన్నిహితంగా ఉంటూ చరవాణిలో చిత్రాలు.... [news_tags_keywords] => Crime,Hyderabad,Student [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 07:16:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చరవాణిలో నగ్నచిత్రాలు పంపించు! - Send nude photos BBA student Harrsashment - EENADU
close

తాజా వార్తలు

చరవాణిలో నగ్నచిత్రాలు పంపించు!

లేదంటే పాతచిత్రాలను తల్లిదండ్రులకు పంపిస్తా
స్నేహితురాలికి బీబీఏ విద్యార్థి వేధింపుల పర్వం

హైదరాబాద్‌ : స్నేహం చేయకుంటే చంపేస్తానని బెదిరించాడు.. భయపడి స్నేహం చేసింది.. కొన్ని రోజుల తర్వాత సన్నిహితంగా ఉంటూ చరవాణిలో చిత్రాలు తీసుకున్నాడు.. ఓరోజు నగ్నచిత్రాలను పంపించాలని కోరాడు.. లేదంటే పాత చిత్రాలను తల్లిదండ్రులకు పంపిస్తానన్నాడు..చివరకు కటకటాల పాలయ్యాడు. రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రయనుద్దీన్‌(19) శంకర్‌పల్లిలోని ఓ విద్యాసంస్థలో బీబీఏ కోర్సు చదువుతూ వసతిగృహంలో ఉంటున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థినితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాడు. తొలినాళ్లలో ఆమె తిరస్కరించింది. పదేపదే తనతో స్నేహం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు అంగీకరించింది. ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకున్నాడు. ఇదే అదనుగా తాను చెప్పినట్లుగా ఉండాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అందుకు అంగీకరించకపోతే సెల్ఫీ చిత్రాలను ఆమె తల్లిదండ్రులకు పంపిస్తానంటూ హెచ్చరించడంతో... బాధితురాలు మిన్నకుండిపోయింది. దీంతో మరింత రెచ్చిపోయాడు. ఓరోజు బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి థియేటర్‌కు సినిమాకు వెళ్లింది. ఆ సమయంలో రయనుద్దీన్‌ ఆమెకు ఫోన్‌ చేశాడు. వాష్‌రూంలోకి వెళ్లి స్వీయ నగ్నచిత్రాలను వాట్సప్‌లో తనకు పంపించాలంటూ డిమాండ్‌ చేశాడు. చివరకు ఒత్తిడికి తలొగ్గి అతడి కోరిక నెరవేర్చింది. ఆ చిత్రాలు తన చేతికి చిక్కేసరికి వేధింపులు మరింత పెంచాడు. తట్టుకోలేని బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ కె.ఎం.విజయ్‌కుమార్‌ బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. రయనుద్దీన్‌ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.