close

తాజా వార్తలు

చాయ్‌ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ

వీడియో వైరల్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత సాదాసీదాగా ఉంటారో తెలిసిందే. బుధవారం ఆమె తన పార్టీ నేతలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో దిఘాలోని దత్తాపూర్‌లోని ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగారు. కారు దిగి ఆ దుకాణంలోకి వెళ్లారు. దుకాణదారుతో కాసేపు ముచ్చటించి ఆమె స్వయంగా తన పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చారు. సీఎం చేసిన ఆ పనికి ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతైంది. దుకాణం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో సెక్యూరిటీ అక్కడకు చేరుకున్నారు. సెక్యూరిటీని దుకాణం వద్దకు రావద్దని చెప్పి అక్కడున్న వారితో కాసేపు మాట్లాడిన అనంతరం సీఎం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వీడియోను మమత తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఆనంద పరుస్తాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చి వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మమతా నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.