Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146046
            [news_title_telugu_html] => 

మృదువుగా పిలిచాడు.. మృగంలా మారాడు..!

[news_title_telugu] => మృదువుగా పిలిచాడు.. మృగంలా మారాడు..! [news_title_english] => Old man Rape attempt on secondclass girl [news_short_description] => అభం, శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి ఇంటికి రమ్మన్నాడు. తాత లాంటి వ్యక్తే కదాని ఆ చిన్నారి అతనివెంట వెళ్లింది. ... [news_tags_keywords] => Crime,Srikakulam,Mandasa [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 09:08:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మృదువుగా పిలిచాడు.. మృగంలా మారాడు..! - Old man Rape attempt on secondclass girl - EENADU
close

తాజా వార్తలు

మృదువుగా పిలిచాడు.. మృగంలా మారాడు..!

 రెండోతరగతి విద్యార్థినిపై వృద్ధుడి అఘాయిత్యం 
పోలీసుల అదుపులో నిందితుడు
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

వైద్యుల సమాధానం విని ఆరేళ్ల బాలిక కుటుంబీకులు ఉన్నచోటే కుప్పకూలిపోయారు!!! వారి నోట మాట రాలేదు!! తమ బిడ్డపై లైంగిక దాడి జరిగిందని తెలిసి నిలువునా వణికిపోయారు! ఆ చిన్నారి పరిస్థితి తలుచుకొని వలవల ఏడ్చేశారు!! ఎవరా ‘మానవ మృగం’ అంటూ ఆరా తీశారు!!  ‘రుషి’ తాత...చాక్లెట్లు ఇస్తానని తీసుకెళ్లి...నన్నలా చేశాడు... అని కూతురు కన్నీటిపర్యంతమవగా... ఈ ఘోరానికి ఒడిగట్టిన
ఆ 62 సంవత్సరాల వ్యక్తిని  శిక్షించాలనుకున్నారు! ఆపై...పోలీసులను  ఆశ్రయించారు మందస మండలంలోని బాధితులు!!

బీఎస్‌పురం (మందస): అభం, శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి ఇంటికి రమ్మన్నాడు. తాత లాంటి వ్యక్తే కదాని ఆ చిన్నారి అతనివెంట వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో అతడిలోని మృగం నిద్ర లేచింది. కామంతో కళ్లు మూసుకుపోయి ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దొరికిపోవడంతో చేసిన తప్పును పెద్దల సమక్షంలో అంగీకరించాడు. తప్పు చేసినందుకు డబ్బు చెల్లిస్తానని, తగువు పెట్టొద్దన్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు. మందస మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అరవై రెండేళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి సోంపేట సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొరకల రుషి (62) ఈనెల 18న రెండో తరగతి విద్యార్థినికి బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తానని ఇంటికి రమ్మన్నాడు. అతడి ఉద్ధేశం తెలుసుకోలేని ఆ చిన్నారి అతడి వెంట వెళ్లగా రుషి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన జరిగిన మరుసటిరోజు చిన్నారి అస్వస్థతకు గురైంది. జననేంద్రియం నొప్పిగా ఉందని, మూత్ర విసర్జన చేసినపుడు ఇబ్బందిపడుతున్నట్లు తన తల్లితో చెప్పింది. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం తెలిసింది. జరిగిన ఘోరాన్ని చిన్నారి తల్లిదండ్రులు గ్రామపెద్దల దృష్టికి తెచ్చారు. పెద్దల సమక్షంలో చేసిన తప్పును నిందితుడు కూడా అంగీకరించాడు. తాను చేసిన తప్పుకు బాధిత కుటుంబానికి కొంత డబ్బు ఇస్తానన్నాడు. అందుకు చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. న్యాయం కోరుతూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడిని సోంపేటకు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.