Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000440
            [news_title_telugu_html] => 

నయవంచక న్యాయవాది అరెస్టు

[news_title_telugu] => నయవంచక న్యాయవాది అరెస్టు [news_title_english] => Lawyer Arrested in case [news_short_description] => ఉద్యోగార్థుల బలహీనతను.. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడో వ్యక్తి.. తాను ఉద్యోగాలిప్పిస్తామంటూ ఒకరిని వంచించి రూ.లక్షలు కాజేశాడు.... [news_tags_keywords] => Job,Crime,Lawyer [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 07:13:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నయవంచక న్యాయవాది అరెస్టు - Lawyer Arrested in case - EENADU
close

తాజా వార్తలు

నయవంచక న్యాయవాది అరెస్టు

 ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం
 ఒకరి నుంచి  రూ. 78 లక్షలు వసూలు

హైదరాబాద్‌: ఉద్యోగార్థుల బలహీనతను.. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడో వ్యక్తి.. తాను ఉద్యోగాలిప్పిస్తామంటూ ఒకరిని వంచించి రూ.లక్షలు కాజేశాడు. తీరా ఉద్యోగాల విషయం అడిగేసరికి మొహం చాటేశాడు. అతనెవరో కాదు సాక్షాత్తూ తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో పనిచేస్తున్న న్యాయవాది.. పేరు తంగెడ వెంకట శివనాగ సుబ్రహ్మణ్య వరప్రసాద్‌. ఇతను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు వేసిన ఉచ్చులో చిక్కినట్లు సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన కోటగిరి రామారావుకు రెండేళ్ల కిందట న్యాయవాది వరప్రసాద్‌ పరిచయమయ్యాడు. తనకు వీఐపీలు తెలుసుననడంతో తన ఇద్దరి కుమారులకు ఉద్యోగాలిప్పించాలని రామారావు అతడిని కోరారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో తెలిసిన వారున్నారని, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలిప్పిస్తానని ఆయన్నుంచి ఆర్నెల్ల వ్యవధిలో రూ.78 లక్షలు దండుకున్నాడు. ఎస్‌.ఎస్‌.సి. ఫలితాల్లో తనకుమారుల నంబర్లు లేకపోవడంతో రామారావు తన డబ్బు తిరిగివ్వాలని వరప్రసాద్‌ను కోరాడు. అతను తప్పించుకోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు.

స్థిరాస్తి వ్యాపారుల్లా మారిన పోలీసులు
నిందితుడు వరప్రసాద్‌ వివరాలను ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ బృందం అతని వివరాలు సేకరించింది. అతను పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఫోన్‌ నంబర్లు మారుస్తూ తెలుగు రాష్ట్రాల్లో తిరగసాగాడు. నార్సింగి పోలీస్‌ ఠాణాలో భూకబ్జా కేసులో నిందితుడని, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఉందని పోలీసులు పేర్కొన్నారు. వరప్రసాద్‌ను పట్టుకునేందుకు ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ బృందం స్థిరాస్తి వ్యాపారుల్లా మారి నిందితుడి మొబైల్‌ నంబరును సేకరించారు. వారం కిందట అతన్ని సంప్రదించగా తనను విజయవాడలో కలవాలని నిందితుడు సూచించాడు. పోలీసు బృందం శుక్రవారం ఉదయం విజయవాడ సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లింది. శంషాబాద్‌లో 20 ఎకరాల్లో వెంచర్‌ వేస్తున్నామని, చిన్న సెటిల్‌మెంట్‌ చేయాలని బృంద సభ్యులు కోరారు. అంతే వరప్రసాద్‌ పోలీసుల ఉచ్చులో చిక్కాడు. వెంటనే అతన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. అనంతరం అరెస్ట్‌ చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.