Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000454
            [news_title_telugu_html] => 

భన్సీలాల్‌... రూ.3000 కోట్లు??

[news_title_telugu] => భన్సీలాల్‌... రూ.3000 కోట్లు?? [news_title_english] => Bansilal Rs 3000 Crores [news_short_description] => గొలుసుకట్టు మోసంతో దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌(ఎఫ్‌ఎంఎల్‌సీ) కేసులో కీలక నిందితుడు భన్సీలాల్‌ ఆచూకీ సైబరాబాద్‌ పోలీసులకు... [news_tags_keywords] => Crime,Hyderabad,ChainMarket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 08:44:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భన్సీలాల్‌... రూ.3000 కోట్లు?? - Bansilal Rs 3000 Crores - EENADU
close

తాజా వార్తలు

భన్సీలాల్‌... రూ.3000 కోట్లు??

సైబరాబాద్‌ పోలీసులకు చిక్కని ఆచూకీ 
ఎఫ్‌ఎంఎల్‌సీ గొలుసుకట్టు మోసంలో కీలకం 
అతడు చిక్కితేనే ఆర్థిక మూలాల గుట్టు రట్టు 

హైదరాబాద్‌: గొలుసుకట్టు మోసంతో దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌(ఎఫ్‌ఎంఎల్‌సీ) కేసులో కీలక నిందితుడు భన్సీలాల్‌ ఆచూకీ సైబరాబాద్‌ పోలీసులకు ఇంకా చిక్కకపోవడంతో రూ.కోట్ల గుట్టు తేలడం లేదు. హరియాణాలోని హిసార్‌ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ కార్యకలాపాలు మోసంలో భాగంగా పలు ప్రాంతాలకు విస్తరించినట్లు సైబరాబాద్‌ ఆర్థిక నేర విభాగం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ సంస్థ సీఎండీ రాధేశ్యాంతో పాటు సంచాలకుడు సురేందర్‌సింగ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. పీడీ చట్టం ప్రయోగించడంతో రాధేశ్యాం కటకటాలకే పరిమితమయ్యాడు. ఈ కేసులో కీలక నిందితుడు భన్సీలాల్‌ చిక్కకపోవడంతో ఆర్థిక మూలాలను పసిగట్టలేకపోతున్నారు. ఎఫ్‌ఎంఎల్‌సీ ఆర్థిక వ్యవహారాలను రాధేశ్యాంకంటే ఎక్కువగా భన్సీలాలే పర్యవేక్షించాడని పోలీసులు గుర్తించారు. వాస్తవానికి రాధేశ్యాం ఏడో తరగతి వరకు చదువుకొని దర్జీగా కొంతకాలం పని చేశాడు. ఓ సంస్థలో చేరి గొలుసుకట్టు వ్యాపారంలోని గుట్టుమట్లను పసిగట్టాడు. ఆ తర్వాత సొంతంగా ఎఫ్‌ఎంఎల్‌సీ సంస్థను ప్రారంభించాడు. ఆర్థిక వ్యవహారాలపై పట్టు లేకపోవడంతో ఆ బాధ్యతను అనుచరుడు భన్సీలాల్‌కు అప్పగించాడు. ఈ నేపథ్యంలో గొలుసుకట్టు మోసం ద్వారా రాబట్టిన డబ్బుతో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా..? విదేశాలకు తరలించారా..? మరేదైనా వ్యాపారానికి మళ్లించారా..? వసూళ్లలో సభ్యులకు తిరిగి చెల్లించింది ఎంత..? తదితర వ్యవహారాల గుట్టు తేలాలంటే భన్సీలాల్‌ను పట్టుకోవడమే కీలకంగా మారింది. ఈ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం దృష్టి సారించడంతో అతడి ఆచూకీ కనుగొనడానికి ప్రాధాన్యం ఏర్పడింది.

పసిగట్టి పరారయ్యాడు..: వివిధ రాష్ట్రాల్లో లక్షలాది మంది సభ్యుల నుంచి ఎఫ్‌ఎంల్‌ఎసీ నిర్వాహకులు సుమారు రూ.3వేల కోట్లు వసూలు చేశారు. రూ. 7,500 కట్టి సంస్థలో చేరితే దాదాపు రెండేళ్లలో రూ. 60వేలు ఇస్తామంటూ మభ్యపెట్టడంతో ఈ సంస్థలో భారీ సంఖ్యలో సభ్యులు చేరారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సంస్థకు ఆదరణ లభించింది. తొలుత కొంతకాలం పాటు డబ్బు సక్రమంగానే చెల్లించిన నిర్వాహకులు తర్వాత తాత్సారం చేస్తుండటంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తనను మోసగించారంటూ కూకట్‌పల్లి వాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేయడంతో అక్రమాల డొంక కదిలింది. పోలీస్‌ బృందం హిసార్‌ వెళ్లగా రాధేశ్యాం, సురేందర్‌సింగ్‌ పోలీసులకు చిక్కారు. భన్సీలాల్‌ మాత్రం తప్పించుకున్నాడు. అప్పట్లో కేవలం రూ.200కోట్లను మాత్రం బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేశారు.

హరియాణా పోలీసులకూ.. 
కొద్దిరోజులపాటు భన్సీలాల్‌ కోసం గాలించినా ఆచూకీ చిక్కకపోవడంతో సైబరాబాద్‌ పోలీసులు మిన్నకుండిపోయారు. తర్వాత హరియాణాలోనూ ఆ సంస్థ నిర్వాహకులపై పలు కేసులు నమోదయ్యాయి. అక్కడి పోలీసులు గాలించినా భన్సీలాల్‌ ఆచూకీ చిక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. సైబరాబాద్‌ పోలీసులు భన్సీలాల్‌పై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) జారీ చేయడంతో విమాన మార్గంలో అతడు విదేశాలకు పారిపోయే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న అతడి పాస్‌పోర్టు వివరాల ఆధారంగా విమానాశ్రయాల్లో ఆరా తీయగా.. ఇటీవల కాలంలో విమాన ప్రయాణం చేయలేదని తేలింది. నేపాల్‌కు వీసా, పాస్‌పోర్టుతో నిమిత్తం లేకుండా వెళ్లే అవకాశముండటంతో అక్కడికి పారిపోయి ఉండొచ్చని అనుమానించారు. ఎఫ్‌ఎంఎల్‌సీ కార్యకలాపాలను నేపాల్‌కు కూడా విస్తరింపజేసేందుకు గతంలో ప్రయత్నించడాన్ని బట్టి పోలీసులు ఆ అంచనాకు వస్తున్నారు. కీలక నిందితుడిని పట్టుకోవడానికి సైబరాబాద్‌ పోలీసుల చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా.. లేవా.. చూడాల్సిందే.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.