Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000509
            [news_title_telugu_html] => 

శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

[news_title_telugu] => శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం [news_title_english] => Massive fire breaks out at S Sreesanth Kochi residense [news_short_description] => టీమిండియా ఆటగాడు ఎస్‌. శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో తెల్లవారుజామున 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి... [news_tags_keywords] => Sreesanth,Teamindia,Cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:15:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం - Massive fire breaks out at S Sreesanth Kochi residense - EENADU
close

తాజా వార్తలు

శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

తప్పిన ముప్పు

తిరువనంతపురం: క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో తెల్లవారుజామున 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. భార్యా పిల్లలు మాత్రమే ఉన్నారు. అయితే వారు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలతో జాతీయ జట్టుకు దూరమైన శ్రీశాంత్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. జీవితకాల నిషేధానికి గురైన అతడికి బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ శిక్షను ఏడేళ్లకు కుదించారు. ఇప్పటికే ఆరేళ్ల పాటు నిషేధం పూర్తిచేసుకున్న అతడి శిక్ష 2020 ఆగస్టులో ముగుస్తుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్‌తో పాటు అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లపై బీసీసీఐ 2013లో జీవితకాల నిషేధం విధించింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.