Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000665
            [news_title_telugu_html] => 

ఒక వ్యక్తి.. మూడు జీతాలు!

[news_title_telugu] => ఒక వ్యక్తి.. మూడు జీతాలు! [news_title_english] => Man draws salaries from three government jobs for 30 years in Bihar absconding [news_short_description] => సురేశ్‌ రామ్‌ గత 30 సంవత్సరాలుగా బీహార్‌ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నాడు. అంతేనా! జీతం కూడా తీసుకునేవాడు. [news_tags_keywords] => crime,government Job,Bihar,Fraud [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:15:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఒక వ్యక్తి.. మూడు జీతాలు! - Man draws salaries from three government jobs for 30 years in Bihar absconding - EENADU
close

తాజా వార్తలు

ఒక వ్యక్తి.. మూడు జీతాలు!

30 ఏళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వైనం

బిహార్‌: ఓ వ్యక్తి.. మూడు జీతాలు తీసుకుంటున్నాడు. అలాగని కష్టించి మూడు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ అవి పొందుతున్నాడంటే పొరపాటే! అతడు జీతాలు పొందుతున్నది మూడు ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా! అదీ ఉన్నతాధికారుల కళ్లుగప్పి గత 30 ఏళ్లుగా!! ఎట్టకేలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానంతో అతడి విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

సురేశ్‌ రామ్‌ గత 30 సంవత్సరాలుగా బిహార్‌ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నాడు. జీతం కూడా తీసుకుంటున్నాడు. ఇంతలో బిహార్‌ ఆర్థికశాఖ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను పర్యవేక్షించేందుకు నూతనంగా సెంట్రలైజ్డ్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగికి సంబంధించిన సమస్త సమాచారం నిక్షిప్తం చేసేందుకు, వారి వ్యక్తిగత వివరాలతో కూడిన పత్రాలను సమర్పించాల్సిందిగా ఉద్యోగులను అధికారులు ఆదేశించారు. రామ్‌ కేవలం ఆధార్‌కార్డ్‌, పాన్‌కార్డ్‌ను మాత్రమే తీసుకెళ్లాడు. మిగతా పత్రాలను సైతం తీసుకురావాల్సిందిగా సురేశ్‌ రామ్‌ను అధికారులు కోరగా.. అతడు అదృశ్యమయ్యాడు. దీంతో అతడి వివరాలు సేకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

‘‘నిందితుడు ఒకే పేరు, పుట్టిన తేదీతో మూడు విభాగాల్లో పని చేస్తూ జీతం తీసుకుంటున్నట్లు సీఎఫ్‌ఎంఎస్‌లో గుర్తించాం. అతడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సూచించారు’’ అని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మధుసూదన్‌ కూమార్ తెలిపారు. భవన నిర్మాణశాఖతో పాటు, రెండు వేర్వేరు జిల్లాల్లో జలవనరులశాఖలో మొత్తంగా మూడు విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా సురేశ్‌రామ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తూ పదోన్నతులు సైతం పొందేవాడని అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.