Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000995
            [news_title_telugu_html] => 

ఆకలి బాధతో అమ్మేసింది..పేగుబంధంతో తల్లడిల్లింది

[news_title_telugu] => ఆకలి బాధతో అమ్మేసింది..పేగుబంధంతో తల్లడిల్లింది [news_title_english] => Sold child for hunger [news_short_description] => ఆకలి బాధకు తాళలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక కన్నకొడుకును అమ్ముకుందా తల్లి... ఆ తర్వాత పేగు బంధం గుర్తుకువచ్చి తల్లడిల్లిపోయింది. తన కొడుకునెవరో అపహరించారంటూ పోలీసులను ఆశ్రయించింది.... [news_tags_keywords] => Hyderabad,Crime,Child [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 07:46:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆకలి బాధతో అమ్మేసింది..పేగుబంధంతో తల్లడిల్లింది - Sold child for hunger - EENADU
close

తాజా వార్తలు

ఆకలి బాధతో అమ్మేసింది..పేగుబంధంతో తల్లడిల్లింది

11 నెలల చిన్నారిని విక్రయించిన కన్నతల్లి
ఎవరో అపహరించారంటూ పోలీసులకు ఫిర్యాదు

నాగోలు: ఆకలి బాధకు తాళలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక కన్నకొడుకును అమ్ముకుందా తల్లి... ఆ తర్వాత పేగు బంధం గుర్తుకువచ్చి తల్లడిల్లిపోయింది. తన కొడుకునెవరో అపహరించారంటూ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాలుగు గంటల్లో బాలుడిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. ఆపై  అమ్మిన తల్లిని.. కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో యాచకురాలిగా బతుకు వెళ్లదీస్తున్న డేరంగుల విజయలక్ష్మి(30) రమేష్‌ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఆమె 2 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు రమేష్‌ మరో మహిళతో వెళ్లిపోయాడు. గతేడాది అక్టోబర్‌ 17న విజయలక్ష్మికి ఓ బాబు జన్మించాడు. అఖిల్‌ అని పేరు పెట్టుకుంది. తనతోపాటు బాలుడి బాగోగుల కోసం రైల్వే స్టేషన్లు.. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ జీవిస్తోంది. రోజులు గడవడం భారంగా మారడంతో కొడుకును అమ్మేద్దామనుకుంది. ఈ నెల 19న షాద్‌నగర్‌ మార్కెట్‌కు వెళ్లి ఫారూఖ్‌నగర్‌కు చెందిన ఓరుగంటి మోష అనే వ్యక్తికి రూ.60వేలకు బాలుడిని అమ్మేసింది. ఆ డబ్బుతో తిరిగి నగరానికి చేరుకున్న ఆ తల్లి మనసును కన్నపేగు బంధం పిండేసింది. ముద్దులొలికే తన కుమారుడిని వదిలి ఉండలేక... మరుసటిరోజు సాయంత్రం ఎల్బీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది. ఎల్బీనగర్‌ చౌరస్తా సమీపంలోని గుంటిజంగయ్యనగర్‌ వద్ద తాను సొమ్మసిల్లి పడిపోగా.. ఇద్దరు దంపతులు ఓ ద్విచక్రవాహనంపై వచ్చి తన కుమారున్ని అపహరించారని.. స్థానికులు ఇది గమనించి వారి బండి నంబరు తనకు రాసిచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి అపహరణ విషయం తెలియగానే ఎల్బీనగర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన సదరు వాహనం నంబరు గల యజమానిని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి ఓ పోలీసు బృందాన్ని షాద్‌నగర్‌కు పంపించారు. వారు అదేరోజు రాత్రి సదరు ద్విచక్రవాహనం యజమాని ఇంటికి వెళ్లి బాబును గుర్తించారు. పోలీసులను చూసి అవాక్కైన మోష తాను అపహరించలేదని.. బాలుడి తల్లి వద్ద రూ.60వేలకు కొనుగోలు చేసిన విషయాన్ని వెల్లడించాడు. కొనుగోలు, అమ్మకాలు అక్రమమని... మోషను స్టేషన్‌కు తీసుకువచ్చి.. బాలుడిని తల్లి వద్దకు చేర్చారు. విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు తప్పని తెలిసి.. అమ్మిన నేరానికి ఆమెపైనా కేసు నమోదు చేశారు. శనివారం విజయలక్ష్మి, మోష ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బాలుడిని శిశు సంరక్షణ కేంద్రానికి  అప్పజెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.