Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000999
            [news_title_telugu_html] => 

అనుచరుల హల్‌చల్‌!!

[news_title_telugu] => అనుచరుల హల్‌చల్‌!! [news_title_english] => Mob attack on young boy [news_short_description] => ఓ ప్రజాప్రతినిధి అనుచరులు శనివారం హల్‌చల్‌ చేశారు. చిన్న విషయానికి ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన వరంగల్‌ కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... [news_tags_keywords] => Boy,Attack,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 08:50:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అనుచరుల హల్‌చల్‌!! - Mob attack on young boy - EENADU
close

తాజా వార్తలు

అనుచరుల హల్‌చల్‌!!

ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి

వరంగల్‌ క్రైం: ఓ ప్రజాప్రతినిధి అనుచరులు శనివారం హల్‌చల్‌ చేశారు. చిన్న విషయానికి ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన వరంగల్‌ కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... హన్మకొండలోని ఓ ప్లాజాలో పి. సుమన్‌కు ఆర్కిటెక్చర్‌ కార్యాలయం ఉంది. ఉదయం ఆఫీస్‌కు వచ్చిన ఆయన మధ్యాహ్నం ఇంటికి వెళ్లే సమయంలో సెల్లార్‌ నుంచి కారు తీస్తుండగా గేటు ముందు ద్విచక్రవాహనం అడ్డంగా ఉంది. పలుసార్లు హారన్‌ కొట్టినా ఎవరూ రాలేదు. ఆయనే కారు దిగి వచ్ఛి. ద్విచక్రవాహనాన్ని పక్కకు జరిపారు. అదే సమయంలో ఆ వాహన యజమానురాలు వచ్ఛి.. తన బైక్‌ను ఎందుకు జరిపావు అంటూ వాదనకు దిగింది. మాటామాట పెరిగింది. ఆ తర్వాత సుమన్‌ అక్కడ నుంచి వెళ్లిపోయి తిరిగి 4.30 గంటల సమయంలో ప్లాజాకు వచ్చాడు. అప్పటికే అక్కడున్న 10 మంది వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఏం అనుకుంటున్నావ్‌.. ప్రజాప్రతినిధి అనుచరులం.. మా సోదరినే ఎదురిస్తావా.. అని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. భయంతో సుమన్‌ పరిగెత్తుకుంటూ హన్మకొండ ఠాణాకు వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. కొంతమందిని గుర్తించినట్లు తెలిసింది. వారు ఓ ప్రజాప్రతినిధి వద్ద డ్రైవర్‌గా పని చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఇరువురు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామన్నారు. విచారణ చేస్తున్నామన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.