Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001474
            [news_title_telugu_html] => 

కట్నం కోసం గర్భిణిని కడతేర్చిన భర్త

[news_title_telugu] => కట్నం కోసం గర్భిణిని కడతేర్చిన భర్త [news_title_english] => Husband Killed Wife For dowry [news_short_description] => మృతురాలి తల్లి యశోదమ్మ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగవరం మండలం గండ్రాజుపల్లె పంచాయతీ జంగాలపల్లె గ్రామానికి చెందిన గటప్ప, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె మీనా(24)ను [news_tags_keywords] => Dowry,Crime,Husband [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 09:07:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కట్నం కోసం గర్భిణిని కడతేర్చిన భర్త - Husband Killed Wife For dowry - EENADU
close

తాజా వార్తలు

కట్నం కోసం గర్భిణిని కడతేర్చిన భర్త

తల్లిని కోల్పోయి అనాథైన రెండేళ్ల బాలిక ●

పరారీలో నిందితుడు

‘అమ్మా.. అమ్మా’ అంటూ తల్లి కోసం ఏడుస్తున్న రెండేళ్ల చిన్నారి

మృతురాలి తల్లి యశోదమ్మ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగవరం మండలం గండ్రాజుపల్లె పంచాయతీ జంగాలపల్లె గ్రామానికి చెందిన గటప్ప, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె మీనా(24)ను తల్లిడండ్రులు 6 సంవత్సరాల క్రితం పలమనేరు మండలం జరవారిపల్లె గ్రామం పి.వడ్డూరు గ్రామవాసి నారాయణకు ఇచ్చి వివాహం చేశారు. రూ.3 లక్షల కట్నంతోపాటు రెండు రూ.లక్షల విలువైన నగలు వేసి ఘనంగా వివాహం జరిపారు. డిగ్రీ వరకు చదువుకున్న నారాయణ వివాహం సమయంలో ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థకు చెందిన బ్యాంకులో చిరుద్యోగం చేసుకుంటూ తాను బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి వివాహం చేసుకున్నాడు. తరువాత ఆ ఉద్యోగం పోవడంతో పి.వడ్డూరులోనే గ్రామస్థులతో మంచిగా ఉంటూ వారికి బ్యాంకుల ద్వారా పశువులు కొనుగోలు చేసేందుకు రుణాలు ఇప్పిస్తూ కమీషన్‌ తీసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇలా సంపాదిస్తూ తన పెద్దనాన్న సాయంతో గ్రామంలోనే ఓ పాల సేకరణ కేంద్రం ప్రారంభించాడు. అయితే రుణాలు ఇప్పించే సమయంలో రైతులకు డబ్బుల విషయంలో కొంత గోల్‌మాల్‌ చేయడంతో వారందరూ ఇతన్ని ప్రశ్నించారు. అదే సమయంలో సాయం చేసిన పెద్దనాన్నతో కూడా గొడవలు రావడంతో పాటు రైతులు తమ డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో పాల సేకరణ కేంద్రం మూసివేశాడు. అప్పటి నుంచి ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఇతని తల్లీతండ్రి కూడా కూలీ పనులు చేసుకొని జీవనం సాగించే వారు కావడంతో ఇతను చేసిన అప్పులతో గ్రామస్థుల వద్ద మాటలు పడలేక గ్రామం విడిచి పనుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్లిపోయారు.

నారాయణ (పాతచిత్రం)

మొదటి నుంచీ వేధింపులు

పెళ్లయినప్పటి నుంచే మీనాకు అత్తింట్లో అదనపు కట్నం కోసం భర్త వేధింపులు ప్రారంభమయ్యాయి. అల్లుడి సంతోషం కోసం మధ్యమధ్యలో డబ్బులు ఇస్తూ, జీవనం సాగించేందుకు ఓ ఆవును కూడా కొనిఇచ్చారు అత్తామామలు. అయినా అతని వేధింపులు ఆగలేదు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం 8 నెలల గర్భిణి అయిన తన భార్య మీనాను ప్రసవ ఖర్చులు భరించలేనంటూ జంగాలపల్లెలోని పుట్టింట్లో వదిలివెళ్లాడు. ఆమె తల్లితండ్రులు బెంగళూరులో కూలీ పనుల కోసం వెళ్లడంతో గ్రామంలోని అవ్వాతాతలే ఆమె బాగోగులు చూసేవారు. ఈమెకు ఇది మూడో కాన్పు కాగా మొదటి కాన్పులో బిడ్డ కడుపులోనే మరణించగా.. రెండేళ్ల క్రితం రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ప్రసవం కోసం భార్యను పుట్టింట్లో వదిలి వెళ్లిన నారాయణ అప్పుడప్పుడు వచ్చి డబ్బుల విషయమై భార్యతో గొడవపడుతూ ఆమె వద్ద డబ్బులుంటే తీసుకెళ్లిపోయేవాడు. వారం రోజుల క్రితం కావళ్ల పండగ కావడంతో గ్రామానికి వచ్చిన నారాయణ అప్పటి నుంచి గ్రామంలోనే ఉన్నాడు. ఆదివారం ఆమెను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండడంతో శనివారం సాయంత్రం మీనా తాత డబ్బుల కోసం బెంగళూరుకు బయల్దేరి వెళ్లాడు. శనివారం రాత్రికి మీనా అవ్వ ఓ ఇంట్లో పడుకొంది. మీనా, నారాయణ ఇద్దరూ ఓ ఇంట్లో పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఏం జరిగిందో ఏమో ముసలామె పడుకున్న ఇంటికి బయటి నుంచి గొళ్లెం పెట్టాడు. భార్య గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేయడంతో ఆమె మరణించింది. ఇంతలో మెలకువ వచ్చిన ముసలామె తలుపు తీసేందుకు ప్రయత్నించగా బయటి నుంచి గొళ్లెం పెట్టి ఉండడంతో గొళ్లెం తీయమని అరిచింది. ఆ శబ్దాలకు పక్కింటి మహిళ వచ్చి గొళ్లెం తీయగా అప్పటికే బయటికి వచ్చిన నారాయణ ‘మీ అమ్మాయి కింద పడిపోయింది చూడండి’ అంటూ చూపించాడు. వాళ్లు వెళ్లి చూడగా అప్పటికే ఆమె ప్రాణం పోయింది. గొంతు చుట్టూ తాడు బిగించిన గుర్తులు ఉండడం, కింద పడిన సమయంలో తలకు చిన్న దెబ్బ తగిలి రక్తం వస్తుండడం గమనించి బయటకు వచ్చి చూసేసరికి నారాయణ పరారయ్యాడు.

సంఘటన జరిగిన విధానం డీఎస్పీకి వివరిస్తూ రోదిస్తున్న మృతురాలి అవ్వాతాత

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

సంఘటనా స్థలాన్ని, మీనా మృతదేహాన్ని పరిశీలించిన పలమనేరు డీఎస్పీ ఆరీఫుల్లా పరారీలో ఉన్న నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని, కఠిన శిక్ష పడేలా చూస్తామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. మృతురాలి తండ్రి గట్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గంగవరం సీఐ రామకృష్ణాచారి, ఎస్సై వెంకటసుధాకర్‌ రెడ్డి నిందితుణ్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. కేసు నమోదు చేసిన తరువాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.