close

తాజా వార్తలు

విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్‌

ఏడుగురు దుర్మరణం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో గగనతల ప్రమాదం చోటుచేసుకుంది. విమానం, హెలికాప్టర్‌ ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మలోర్కా ద్వీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

జర్మనీకి చెందిన ఈ హెలికాప్టర్‌ మలోర్కా ద్వీపం మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న విమానాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు లోహవిహంగాలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు ప్రయాణికులు, పైలట్‌తో పాటు విమానంలోని ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రమాదంపై స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాన్‌చెజ్‌ విచారం వ్యక్తం చేశారు. 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.