close

తాజా వార్తలు

జగిత్యాలలో అమానవీయ ఘటన

జగిత్యాల: జగిత్యాలలో అమానవీయ ఘటన జరిగింది. తన ఇంట్లో అద్దెకున్న కుటుంబంలోని వృద్ధురాలు చనిపోతుందని భావించిన యజమాని.. ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించాడు. వివరాల్లోకి వెళితే.. 95 ఏళ్ల వృద్ధురాలు నర్సమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపోమాపో చనిపోతుందనే అనుమానంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు. విధిలేని పరిస్థితుల్లో నర్సమ్మ కుటుంబం శ్మశానాన్నే నివాసంగా మార్చుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్పందించారు. నర్సమ్మ కుటుంబాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.