close

తాజా వార్తలు

టెకీ హత్య..ఆ యువతిని ఆరా తీసిన పోలీసులు

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీశ్‌ దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అతడి సెల్‌ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఎక్కడ ఉన్నాడనేది తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. హేమంత్‌ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

ఆ యువతితో సన్నిహితంగా మెలగడంతో విభేదాలు?
సతీశ్ హత్య కేసులో ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హేమంత్‌, సతీష్‌కు మధ్య ఉన్న గొడవల గురించి ఆ యువతిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వీరిద్దరితో ఎంత కాలంగా పరిచయం ఉందనే సమాచారంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.  సతీశ్, హేమంత్ భాగస్వామ్యంతో నెలకొల్పిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఆ యువతి ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే, ఆ అమ్మాయితో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. 

ఒక్కడే హత్య చేశాడా?
ఈ క్రమంలోనే ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఇద్దరి మధ్య వైరం పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హేమంత్‌ ముందస్తు ప్రణాళిక ప్రకారం సతీశ్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, సతీశ్‌ను ఇంత దారుణంగా ఒక్కడే హత్య చేశాడా? లేకపోతే అతడికి ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.