close

తాజా వార్తలు

6కిలోల బంగారం సీజ్‌.. నలుగురి అరెస్టు

కోల్‌కతా: కోల్‌కతాలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. శనివారం కోల్‌కతాలోని బుర్రా బజార్‌కు చెందిన వారి నుంచి 6.347 కిలోల బంగారం పట్టుకున్నారు. మొత్తం 14 కడ్డీల రూపంలో ఉన్న ఈ బంగారం మొత్తం విలువ రూ.2.53 కోట్లు ఉంటుందని అంచనా. సాల్ట్‌లేక్‌ సమీపంలో రహదారిపై వెళ్తున్న ఆటోను పోలీసులు తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆటోలో వెళ్తున్న రాఖీ బిస్వాస్‌, నమితా బిశ్వాస్‌, రినా మొండల్‌, ఆటో డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ సర్ధార్‌లను అధికారులు ఆపారు. వాహనంలో నిషేధిత వస్తువులేమైనా తరలిస్తున్నారేమోనన్న అనుమానంతో వారిని ప్రశ్నించగా తొలుత సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆ తర్వాత పదే పదే ప్రశ్నలు కురిపించడంతో చివరకు ఓ పెట్టెలో దాచి స్మగ్లింగ్‌ చేసిన బంగారు కడ్డీలను తీసుకెళ్తున్నట్టు వారు అంగీకరించారు. దీంతో  బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ నలుగురినీ అరెస్టు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.