
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్కు కథానాయకుడు ప్రభాస్ మద్దతు తెలిపారు. అయితే, అది రాజకీయంగా మద్దతు కాదండోయ్! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కొన్ని సూచనలు చేశారు. ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాం. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి’’ అని ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్ చేసిన పనికి యువ కథానాయకుడు ప్రభాస్ ఫేస్బుక్ వేదికగా మద్దతు తెలిపారు. కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ప్రభాస్ తిరిగి పంచుకుంటూ ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. దయచేసి ఈ విషయాన్ని అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్యంగా ఉండండి’’ అని పేర్కొన్నారు. ప్రభాస్ మద్దతు తెలిపినందుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళన
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- హిట్మయర్
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
