close

తాజా వార్తలు

హాయిగా నిద్రపట్టాలంటే...

కొందరు మహిళలకు ఓ పట్టాన నిద్రపట్టదు. అలాంటివారు తమ దైనందిన జీవితంలో ఈ మార్పులు చేసుకుని చూడమని చెబుతున్నారు వైద్యులు.
* మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే... మానుకునేందుకు ప్రయత్నించండి. మరీ తప్పదనుకుంటే... ఓ పదినిమిషాలు నిద్రపోయేలా చూసుకోవాలి. దీన్ని పవర్‌న్యాప్‌ అంటారు.
* వ్యాయామంతోనూ నిద్ర సమస్య దూరమవుతుంది. అలాగని అదేపనిగా చేయడం, రాత్రుళ్లు నిద్రకు ముందు చేయడం సరికాదు. ఆ ప్రభావం నిద్రపై పడుతుందని
మరవకండి.
* కొన్నాళ్లవరకూ నిద్రపోయేముందు టీవీ లేదా పుస్తకం చదివే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. వీటితోనూ సమస్య ఎదురుకావొచ్చు.  బదులుగా కొన్ని నిమిషాలు ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు ఉన్నా పోతాయి.
* కొన్నిసార్లు దుస్తులు సౌకర్యంగా లేకపోయినా, పరుపు సరిగ్గా కుదరకపోయినా ఓ పట్టాన నిద్రపట్టదు. ఈ రెండు సమస్యలు లేకుండా చూసుకోండి. దుప్పట్లు, దిండ్ల గలేబుల్ని ఎప్పటికప్పుడు ఉతికేలా చూసుకోండి.
* మనసుకు సాంత్వన ఉండేందుకు తక్కువ స్వరంలో సంగీతం వినేందుకు ప్రయత్నించండి. ఈ రోజుల్లో అలాంటి యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.