close

తాజా వార్తలు

నల్లమల ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య

ఆళ్లగడ్డ గ్రామీణం: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఎగువ అహోబిలం ప్రహ్లాదబడి వద్ద చనిపోయి ఉన్న ప్రేమజంటను గుర్తించిన స్థానికులు వెంటనే ఆళ్లగడ్డ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవపంచనామా నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడు కడప జిల్లా పెదముడియం మండలం కల్వటాల గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌(20)గా పోలీసులు గుర్తించారు. అతను జమ్మలమడుగులో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌కుమార్‌ తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
Saket Pranamam
tsmbanner
besttaxfiler
VITEEE 2020
dr madhu

Panch Pataka

దేవతార్చన