close

తాజా వార్తలు

నాన్న గుండె పగిలింది

 సంరక్షణ చూడటం లేదని తండ్రి బలవన్మరణం
కలెక్టరేట్‌ సముదాయంలో ఆత్మహత్య
 శుక్రవారం విచారణకు హాజరై.. శనివారం ఉరేసుకుని మృతి

భువనగిరి గ్రామీణం, భువనగిరి, న్యూస్‌టుడే: నాన్న.. భరోసా కల్పించేవాడు.. బతుకుకు బాట పరిచేవాడు.. అలాంటి నాన్న గుండెలపై చిన్నప్పుడు ఆడుకున్న బిడ్డల చర్యలే ఆ తండ్రిని కలతకు గురిచేశాయి. కన్న కొడుకుల కంటే నమ్ముకున్న భూమే నయమనుకున్నాడు. బిడ్డలకు పంచిన ఆ భూమిని తనకు తిరిగి ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయాడు.. ఉరేసుకొని తనువు చాలించాడు.
కుమారుల నుంచి తన భూమి తనకు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగిన వృద్ధుడు తనువు చాలించాడు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ సముదాయంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని మృతిచెంది ఉండటం శనివారం కలకలం రేపింది. శుక్రవారం కలెక్టర్‌ వద్ద విచారణకు హాజరైన మరుసటి రోజే విగతజీవి అయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన వరకాంతం ఎల్లారెడ్డి (80) తన కుమారులు పుల్లారెడ్డి, సుదర్శన్‌రెడ్డికి ఆరు ఎకరాల చొప్పున 12 ఎకరాల భూమిని గతంలో గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. తన కుమారులతో విభేదించి ఐదేళ్ల క్రితం భువనగిరి ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇవ్వాలని ఆర్డీవో తీర్పు ఇచ్చినా.. భూమే కావాలంటూ ఎల్లారెడ్డి కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ శుక్రవారం పేషీ నిర్వహించారు. ఎల్లారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. స్పందించని పెద్ద కుమారుడు పుల్లారెడ్డికి చెందిన ఎకరం భూమిని తండ్రికి ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు.విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎల్లారెడ్డి శనివారం ఉదయం విగత జీవిగా కనిపించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు భువనగిరి గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ తండ్రి సంరక్షణ చూసుకుంటామని హామీ ఇచ్చామని,  భూమి తిరిగి ఇవ్వలేమన్నామని చిన్న కొడుకు సుదర్శన్‌రెడ్డి చెబుతున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.