close

తాజా వార్తలు

పాక్‌ 2050 సార్లు మాట తప్పింది

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎండగట్టిన భారత్‌

దిల్లీ: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ సాక్ష్యాలతో బుద్ధి చెప్పింది. ఈ ఏడాదిలో 2050సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ ఘటనల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సరిహద్దులో ఉన్న ఉగ్రవాదుల సాయంతో పాక్‌ దళాలు పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది. భారత పౌరులు, సరిహద్దులో ఉన్న వాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఇలా అడ్డదారులు తొక్కడం పాక్‌ మానేయాలి.  ఈ ఏడాది పాక్‌ 2050సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఇప్పటికే ఎన్నో సార్లు పాక్‌కు చెప్పి చూసినా ఫలితం లేకుండా పోతోంది. భారత్‌ చాలా సంయమనం పాటించింది. ఇక మీదట దీటుగా సమాధానం చెబుతుంది’ అని తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.