
తాజా వార్తలు
హైదరాబాద్: వెండితెరపై ప్రభాస్-కాజల్‌ది హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందాయి. ఇటీవల ‘సాహో’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ కాజల్ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. కాజల్ గురించి చెప్పాలని విలేకరి ప్రభాస్‌ను కోరగా.. ‘అప్పట్లో కాజల్ డ్రెస్సింగ్ పర్వాలేదనిపించేది.. కానీ ప్రస్తుతం చాలా బాగుంటుంది’ అని తెలిపారు. ఆ సమయంలో ఈ విషయం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను ప్రశంసించారు. ప్రభాస్ గురించి చెప్పాలని విలేకరి అడగగా ‘‘ఐరన్‌మ్యాన్’, ‘హల్క్’ కలిస్తే ప్రభాస్’ అని కాజల్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాజల్ ప్రశంసల పట్ల ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘రణరంగం’ చిత్రంలో కాజల్ మెరిశారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
