close

తాజా వార్తలు

ఇళ్లపై కూలిన విమానం.. ఏడుగురు మృతి

బొగోటా(కొలంబియా): దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొంది. ఓ చిన్న విమానం ఇళ్ల సముదాయాలపై కుప్పకూలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు అక్కడి విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఈ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందని వెల్లడించారు. పొపయన్‌ నగర శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో అక్కడే ఇళ్ల మధ్య ఆడుకుంటున్న ఓ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అక్కడి అధికారులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.