
తాజా వార్తలు
హైదరాబాద్: హుజూర్‌నగర్‌లో తెరాస గెలుపు నల్లేరుపై నడకేనని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సమీపించాక తమకు మెజార్టీ ఎంతనేది చెప్పగలమని వ్యాఖ్యానించారు. తమకు పోటీ కాంగ్రెస్‌తోనేనని అన్నారు. భాజపా ప్రభావం ఉండదని చెప్పారు. తెరాసను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో సంబంధం ఉండదని, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఫలితాలు పునరావృతం అవుతాయని జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల ఐక్యత పీతల కలయిక వంటిదని ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ నేతలందరూ కలిసి వచ్చినా తమ గెలుపును ఆపలేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌లో స్థానికేతరుడుగా చెప్పారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
