
తాజా వార్తలు
శాసనమండలిలో వెల్లడించిన కేటీఆర్
హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనమండలి ఆమోదించింది. అంతేకాకుండా 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. అందులోని విషయాలను మంత్రి కేటీఆర్ సభకు వివరించారు. రాష్ట్ర జీఎస్బీపీతో పోల్చితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చులు తగ్గుతాయని కాగ్ వెల్లడించినట్లు కేటీఆర్ తెలిపారు.
2016-17లో పెరిగిన క్యాపిటల్ వ్యయం 2017-18లో తగ్గినట్లు కాగ్ నివేదిక ఇచ్చిందని. ప్రాథమికలోటు తగ్గినా.. ఖర్చులను తీర్చే స్థాయిలో అప్పులే కాని, రాబడి లేదని కాగ్ వెల్లడించినట్లు కేటీఆర్ తెలిపారు. బడ్జెట్ అంచనాలు, వాస్తవాలకు మధ్య అంతరం తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ హేతుబద్ధం చేయాలని కాగ్ పేర్కొంది. మూడేళ్లుగా రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో సమర్థత పెరిగినప్పటికీ..గత బడ్జెట్ అంచనాలతో పోల్చితే రెవెన్యూ రాబడి రూ.24,259 కోట్లు తగ్గిందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి వ్యయం, క్యాపిటల్ వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ.. విద్యా రంగంలో మాత్రం వెనకబడి ఉందని తేల్చిచెప్పింది. గత కొన్నేళ్లుగా అప్పులపై అధికంగా ఆధారపడటంతో చెల్లింపుల బాధ్యతలు పెరిగాయని వివరించింది. ‘ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. డిస్కంల పునరుత్తేజం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి. సాగు నీటి ప్రాజెక్టులపై ఇప్పటి వరకు రూ.70,758 కోట్లు ఖర్చయ్యాయి’ అని కాగ్ తెలిపినట్లు కేటీఆర్ వివరించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
