close

తాజా వార్తలు

విశాఖ జిల్లాలో ఎన్‌కౌంటర్‌

జీకే వీధి (విశాఖ): ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ తెలిపారు. మరికొందరు మావోయిస్టులు గాయపడి ఉండొచ్చని పేర్కొన్నారు. ఘటనా స్థలిలో 4 తుపాకులు, ల్యాండ్‌మైన్‌, కిట్‌బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ దళాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయని చెప్పారు.

ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహించాయి. గుమ్మిరేవులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్‌ దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. గతేడాది సెప్టెంబర్‌ 23న మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మరణించారు. వారు మృతిచెంది రేపటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. దీనికి ఒక్కరోజు ముందు ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.