
తాజా వార్తలు
నల్గొండ: నేతన్నలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నల్గొండలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లో అతిపెద్ద కాకతీయ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నామన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక రైతులు, చేనేతల ఆత్మహత్యలు తగ్గాయన్నారు.
జిల్లాలోని దండుమల్కాపురం వద్ద పారిశ్రామిక పార్కును అతి త్వరలో ప్రారంభించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. దాంతో సుమారు 13వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. దామెరచర్లలో మెగా పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలకు దీటుగా, ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నట్లు కేటీఆర్ వివరించారు. నల్లొండలో మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు రూ.35 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- మరోసారి నో చెప్పిన సమంత
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
