close

తాజా వార్తలు

భూటాన్‌లో కూలిన భారత ఆర్మీ హెలికాప్టర్‌

ఇద్దరు పైలట్ల మృతి

దిల్లీ: భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్‌ ఒకటి భూటాన్‌లో కూలింది. మరికొద్దిసేపట్లో ల్యాండ్‌ అవుతుందనగా ఖెంటంగ్మనీ పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. వీరిలో ఒకరు భారత ఆర్మీ చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ర్యాంక్‌ అధికారి కాగా.. మరొకరు భారత సైన్యంతో కలిసి శిక్షణ తీసుకుంటున్న భూటాన్‌ ఆర్మీ పైలట్‌. 

భారత మిలిటరీ శిక్షణ బృందానికి చెందిన ఈ హెలికాప్టర్‌ విధుల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖిర్ము ప్రాంతం నుంచి భూటాన్‌లోని యాంగ్‌ఫుల్లా ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత యాంగ్‌ఫుల్లా సమీపంలో ఈ హెలికాప్టర్‌ గ్రౌండ్‌ కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టగా ఖెంటంగ్మనీ పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.