
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనారనౌత్, హృతిక్‌రోషన్ కొంతకాలంపాటు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ విషయంపై వివాదాలు చెలరేగాయి. చివరికి ఈ విషయం కోర్టు నోటీసుల దాకా వెళ్లిన విషయం కూడా తెలిసిందే. తాజాగా కంగనా రనౌత్ ‘తానే హృతిక్‌ని అయితే కంగనాకు ఫోన్ చేసి క్షమాపణలు చెబుతాను’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంగన పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఒకరోజు ఉదయాన్నే మీరు లేవగానే హృతిక్రోషన్లాగా మారిపోతే.. ఏం చేస్తారు?
కంగన: ఒకవేళ నేను హృతిక్లాగా మారితే వెంటనే ఫోన్ తీసుకుని కంగనా రనౌత్‌కు కాల్ చేస్తాను. ఇప్పటివరకూ జరిగిన దానికి క్షమించమని కోరతాను.
మీ జీవితంలో తొలి ప్రేమ గురించి చెప్పండి?
కంగన: అందరిలాగానే నా తొలిప్రేమ నా టీచర్‌తోనే. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక టీచర్ని చాలా ఇష్టపడ్డాను.
మీ తొలి రిలేషన్ షిప్?
కంగన: 17ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఒక పంజాబీ అబ్బాయిని ఇష్టపడ్డాను. చాలా అందంగా ఉండేవాడు. తన వయసు 28 ఏళ్లు. నన్ను చిన్నపిల్లా అని పిలిచినప్పుడు నా గుండె ఆగిపోయినంతపని అయ్యింది. మేము కొంతకాలం రిలేషన్లో ఉన్నాం. కొన్నాళ్లకు విడిపోయాం.
తొలి ముద్దు?
కంగన: అప్పట్లో నాకు ముద్దు పెట్టడం వచ్చేది కాదు. నా చేతిమీద ముద్దు పెట్టుకుంటు ఉండేదాన్ని. అలా నేను ముద్దు పెట్టడం నేర్చుకున్నాను. నా తొలి ముద్దు చాలా టెన్షన్‌తో కూడుకున్నది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
